బ్రేకింగ్ : జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన కమెడియన్సులో కిర్రాక్ ఆర్పి కూడా ఒకరు.. జబర్దస్త్ వదిలేసిన కిరాక్ ఆర్పి ఆ తర్వాత డైరెక్టర్ గా ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఆ చిత్రం అనుకోని కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. దాంతో కిర్రాక్ ఆర్పి వ్యాపార బాట పట్టి సక్సెస్ అయ్యారు.. కిరాక్ ఆర్పి నెల్లూరు చేపల పులుసు బిజినెస్ స్టార్ట్ చేసాడు.. కాగా ఈ బిజినెస్ సక్సెస్ ను చూసి ఓర్వలేని కొంతమంది నెగటివ్ ప్రచారం చేస్తున్నారు..
కొన్ని నెలల క్రితం కిర్రాక్ ఆర్పీ కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ ఓపెన్ చేశారు. 40 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసి పెద్ద ఎత్తున ప్రారంభించారు. అనూహ్యంగా బిజినెస్ సక్సెస్ అయింది. నెల రోజుల్లోనే తన పెట్టుబడి తిరిగి వచ్చేసిందని లాభాలు మొదలయ్యాయి అంటూ స్వయంగా తెలిపాడు. హైదరాబాద్ నగర శివారులో వంటశాల ఏర్పాటు చేసి నెల్లూరుకి చెందిన సిబ్బందితో వివిధ రకాల చేపల పులుసు చేయిస్తున్నారు. కిరాక్ ఆర్పీ చేపల పులుసు వ్యాపారానికి డిమాండ్ పెరగడంతో అదనంగా మరికొంతమంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
మణికొండ తో పాటు హైదరాబాదులో పలు ఏరియాలో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు బ్రాంచెస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా కిర్రాక్ ఆర్ పి తెలిపాడు. కాగా కిరాక్ ఆర్పి వ్యాపారం అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొంతమంది కుట్రలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.. కిరాక్ ఆర్పి బిజినెస్ దెబ్బతీసేందుకు ప్రణాళికలు వేస్తున్నారట. కొంతమంది పెద్దారెడ్డి చేపల పులుసు బాగోలేదంటూ దుష్ప్రచారం మొదలు పెట్టారట.. నెగిటివ్ టాక్ బయటకు తీసుకువెళ్తున్నారట ఆ పెయిడ్ బ్యాచ్.. ఈ విషయాన్ని కూడా కిరాక్ ఆర్పి యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నేను పెద్ద వంటశాల ఏర్పాటు చేసి చేయి తిరిగిన వంటకాలతో పలు రకాల చాపల పులుసులు తయారు చేయించి కష్టమర్స్ కి అందిస్తున్నాను. ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తిన్నవాళ్లు 10 మంది కస్టమర్స్ ని తీసుకువస్తున్నారు. కస్టమర్స్ స్వయంగా తమ సన్నిహితులకు చెప్పి వ్యాపారం అభివృద్ధి చేస్తున్నారు. చేపల పులుసు రుచిగా లేకపోతే ఇలా ఎవ్వరూ చేయరు కదా.. ఒక పెయిడ్ బ్యాచ్ తయారయ్యారు. సోషల్ మీడియాలో నా వ్యాపారం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎంత నెగెటివిటీ స్ప్రెడ్ చేసిన నా వ్యాపారానికి ఏమీ కాదు..
వాళ్ళు చేసే దుష్ప్రచారం నా వ్యాపారానికి మరింత పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది అని కిరాక్ ఆర్పి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. నెగిటివ్ ప్రచారం ఎంతగా ప్రజల్లోకి వెళ్తే ఒక్కసారి నా చాపల పులుసు వారు రుచి చూశాక ఆ టాక్ తప్పని వాళ్లే ఒప్పుకుంటారు అని కిరాక్ ఆర్పి నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా తన వ్యాపారం మూతపడదని బలంగా చెప్పారు కిరాక్ ఆర్పీ.