Anicka Vikramman : స్టార్ హీరోయిన్ కి తీవ్ర గాయాలు.. కంగారులో ఫ్యాన్స్..

Anicka Vikramman నటి తీవ్రగాయాలతో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రేమికుడి నిర్వాకమే ఈ గాయాలకు కారణమని తెలిపింది. ఆ నటి ఎవరో కాదు కోలీవుడ్‌కు చెందిన అనికా విజయ్‌ విక్రమన్‌. ముఖంపై గాయాలు, ఉబ్బిన కళ్లు, గాయాలకు సంబంధించిన ఫొటోలను చూసిన ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

Anicka Vikramman injured on her boy friend photos
Anicka Vikramman injured on her boy friend photos

అనికా విజయ్‌ విక్రమన్‌ అనూప్‌ పిళ్లై అనే వ్యక్తితో డేటింగ్‌ చేస్తున్నది. అతనే తన పై ఇలా దాడి చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని.. అప్పుడు కాళ్లు పట్టుకుంటే వదిలేశాడని.. ఇప్పుడు మళ్లీ దాడి చేశాడని తెలిపింది. అనికా విజయ్‌ విక్రమన్‌ ఇన్‌స్టా పోస్ట్‌లో తన బాధను తెలిపింది. నాకు ఏమి జరిగిందో వదిలిపెట్టినప్పటికీ.. నాకు నిరంతరం బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నా కుటుంబంపై నిరంతరం బురద జల్లుతున్నారు. దురదృష్టవశాత్తు నేను అనూప్ పిళ్లై అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నాను.

అయితే అతను నన్ను మానసికంగా, శారీరకంగా హింసించాడు. అలాంటి నిచుడిని నేనెప్పుడూ ఇంతవరకు చూడలేదు. ఇంత జరిగినా కూడా నన్ను బెదిరిస్తున్నాడు. అతను ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. ముందు చెన్నైలో తొలిసారిగా దాడి చేశాడు. ఆ తర్వాత నా కాళ్ల మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. అతన్ని క్షమించడానికి నేను మూర్ఖురాలిని. బెంగుళూరులో ఉన్నప్పుడు రెండోసారి దాడికి పాల్పడ్డాడు. అప్పుడు డబ్బులను ఎరగా వేశాడు. మళ్లీ నాపై దాడి చేసే ధైర్యం వచ్చింది. నేను దెబ్బలు భరించలేక ఏడుస్తుంటే డ్రామా బాగా చేస్తున్నావ్ అంటూ హేళన చేస్తు నవ్వేవాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నెక్స్ట్ వీక్ వరకు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించను అంటూ గాయాలకు సంబంధించిన ఫొటోలను నటి పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి..