Anasuya: బుల్లితెర అందాల యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన గ్లామర్, మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. పలు టీవీ షోలలో యాంకర్ గా చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమా రంగంలో కూడా అడుగు పెట్టింది. మంచి మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ వెండి తెర మీద కూడా తన సత్తా చూపించింది..
అనసూయ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా బాగా కలిసి వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులు దగ్గర మంచి మార్కులే కొట్టేసింది. ఇటీవల పాన్ ఇండియా చిత్రం పుష్పా సినిమాలో కూడా దాక్షాయిని పాత్రలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించింది తనేంటో ప్రతిసారి నిరూపించుకుంటుంది.
అనసూయ ఇంటర్ సెకండియర్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడింది. ఎన్ సీ సీ క్యాంపులో శశాంక్ భరద్వాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు. కానీ వెంటనే ఓకే చెప్పకుండా ఓ సంవత్సరం తర్వాత మళ్లీ ఎన్సిసి క్యాంపులో భరద్వాజ్ స్నేహం ను ప్రేమగా అంగీకరించింది. 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తరువాత పెద్దల అంగీకారంతో 2010 ఫిబ్రవరి 10న మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అనసూయ కాస్త అనసూయ భరద్వాజ్ అయిపోయింది.
అనసూయ దంపతులకు ఇద్దరు పిల్లలు. సుశాంక్ భరద్వాజ్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్నారు. అనసూయ తన 38వ పుట్టినరోజు మాల్దీవ్స్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకుంది . ఈ సందర్భంగా తన భర్త శశాంక్ భరద్వాజ్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది.
ప్రేమ, అన్యోన్యంగా ఉండడం గురించి, చిన్న చిన్న లోపాలను అర్థం చేసుకోవడం గురించి 17 సంవత్సరాల క్రితం నాకు ప్రామిస్ చేశావు.. అప్పుడు నేను మాత్రమే ఉన్నాను. 8 సంవత్సరాల క్రితం ఇదే రోజు నాకోసం వీటి గురించి ప్రపంచానికి పరిచయం చేశావు
.. హ్యాపీ 8 లవ్ అంటూ అనసూయ భర్త తనకు ప్రామిస్ చేసిన విషయాలను ట్వీట్ చేసింది.. అనసూయ కి తన భర్తకి పెళ్లికి ముందు ఆ తరువాత జరిగిన విషయాలన్నింటినీ అనసూయ అందరితో షేర్ చేసుకుంది.