Inaya: ఇనయా సుల్తానా.. బిగ్ బాస్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. బిగ్ బాస్ సీజన్ 6 లో ఆర్జీవి బ్యూటీగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయ తనకంటూ ప్రత్యేక ఇంగ్లీషులో క్రియేట్ చేసుకుంది.. బిగ్ బాస్ షో లో విజేతగా నిలవకపోయినా తన ఆటతీరు, ప్రవర్తనతో అభిమానుల మనసులు గెల్చుకుంది. అందుకే ఆమె షో నుంచి ఎలిమినేట్ అయినప్పుడు అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ ఫ్యాన్స్ బిగ్‌బాస్ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చేరువగా ఉంటుంది..
నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ తో సందడి చేస్తూనే ఉంటుంది.. సాంప్రదాయ దుస్తుల ఆకట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ ఇప్పుడు ట్రెండు మార్చింది. నయ లుక్ తో తన ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. సరికొత్తగా కనిపించి గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇనయ తాజ్ మహల్ ను సందర్శించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఒకే ఫ్రేమ్ లో రెండు అందాలు అంటూ ఇనయ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి..
తాజ్ మహల్ అంటేనే ప్రేమకు చిహ్నం.. తాజ్ మహల్ దగ్గరికి వెళ్లిన ఇనయ ను ఎవరి కోసం అక్కడి వెళ్లవు అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంకెవరు కోసం సోహెల్ కోసమే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మన మనసులో మాట చెప్పిన ఇనయ సోహెల్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయ తన క్రష్ సోహైల్ ను కలిసింది.. అంతేకాదు తన మనసులో ప్రేమను బయట పెడుతూ ఓ వీడియో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. ఇనయా రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని వెళ్లి సోహైల్ ముందు మోకాళ్ల మీద కూర్చుని మరీ ప్రపోజ్ చేసింది ఇనయా. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం అని సొహైల్‌పై ప్రేమను కురిపించింది ఇనయ.
ఇప్పుడు తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళింది కూడా తన కోసమేనని టాక్ వినిపిస్తోంది. ప్రేమికుల చెబుతున్న ప్రకారం.. తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి మన మనసులో ఉన్నవారు మనకి దగ్గర అవ్వాలని కోరుకుంటే .. కచ్చితంగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారనే నమ్మకం ఉందని అందుకే సోహెల్ తన లవ్ యాక్సెప్ట్ చేయాలని ఇనయ తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళిందనీ టాక్. తాజ్ మహల్ దగ్గర షేర్ చేసిన ఇనయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.