Vastu Tips : స్టడీ రూమ్ లో ఏ వస్తువులు ఎక్కడ పెడితే మీ పిల్లలకి ర్యాంకులు వస్తాయో తెలుసా..?

Vastu Tips : పూర్వం మన పెద్దలు వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించేవారు. ఆ ఆచారాన్ని ఇప్పటికీ మనం ఆచరిస్తున్నాము. అందుకు కారణం వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మిస్తే సుఖశాంతులు, మరియు భోగభాగ్యలు కలుగుతాయని మన నమ్మకం. దేవుడి గది, వంటగది కి ప్రత్యేకంగా వాస్తు ప్రకారం ఎన్నో ప్రణాళికలు వేసుకొని నిర్మించుకుంటారు. కానీ పిల్లల స్టడీ రూమ్ నిర్మించేటప్పుడు కొంచెం అశ్రద్ధ వహిస్తుంటారు. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పిల్లలు చదువుకోవడం కోసం స్టడీ రూమ్ ను ఏర్పాటు చేయాలి.

పిల్లలు ఏ స్థలంలో, ఏ వైపు కూర్చుని చదువుకోవాలనేది వాస్తూరీత్యా సరైనది అయి ఉండాలి. అప్పుడు వారి భవిష్యత్తు గురించి మంచి ప్రణాళిక వేసుకొని విజేతలవుతారు.ఇల్లు కట్టేటప్పుడే పూజ గది ఎంత ముఖ్యమో స్టడీ రూం ఎక్కడ ఉండాలనేది కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. వాస్తు ప్రకారం, స్టడీ రూమ్ లేకపోతే, పిల్లలు ఏకాగ్రతతో అధ్యయనం చేయలేరు. పిల్లల మనస్సు చదువుపై నిమగ్నమై ఉండక ఇతర విషయాలపై ద్రుష్టి సారిస్తారు . దీనివల్ల చదువుల్లోను, ఆటలోను వెనుకబడిపోతారు. వాస్తు ప్రకారం స్టడీ రూమ్ ఏ విధంగా ఉండాలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

How to gat ur children brilliant in their studies
How to gat ur children brilliant in their studies

వాస్తు ప్రకారం స్టడీ రూమ్ ను ఎలా ఏర్పాటు చేయాలంటే..

వాస్తు ప్రకారం, స్టడీ రూమ్‌ను పడమర దిక్కుకు మధ్యలో నిర్మించడం మంచిది.

స్టడీ రూమ్ లో విండోలు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండేలా చేయాలి.. దాని ద్వారా అక్కడ సరైన కాంతి ఉండి చదువుపై ఏకాగ్రత పెరిగి చదువుల్లో రానిస్తారు.

స్టడీ రూమ్ గుమ్మం తూర్పు లేదా పడమర దిశలో పెట్టాలి.

మీ స్టడీ రూం లో ఉత్తర మరియు తూర్పు దిక్కుకు మధ్యలో చదువుల తల్లి సరస్వతిదేవీ చిత్రపటాన్ని ఉంచి ఉదయం లేవగానే దర్శించుకుంటే పాజిటివిటి పెరిగి అనుకూల ఫలితాలు వస్తాయి.

స్టడీ రూమ్‌లో చదువుతున్నప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు అభిముఖంగా ఉండేలా చూసుకోవాలి.అప్పుడే సరైనా కాంతి లభించును.

మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను స్టడీ రూమ్‌లో పడమర, దక్షిణానికి మధ్యలో ఉండేలా సెట్ చేసుకోవాలి.

స్టడీ రూమ్ ను ఎల్లప్పుడు బ్రైట్ కలర్ తో అలంకరించుకోవాలి.ఇలా కంటితో బ్రైట్ కలర్ చూడడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మీ పిల్లలు కూడా తమ చదువు లో ఉన్నత ర్యాంకులు తెచ్చుకోవడం ఖాయం.