Samsung 5G Phones : దేశంలోనే టెలికాం దిగ్గజ సంస్థలలో సాంసంగ్ కూడా ఒకటి. ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం అయినటువంటి సాంసంగ్ గాలక్సీ నుంచి M13 సీరీస్ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఇకపోతే త్వరలోనే గాలక్సీ M13 సిరీస్లో 4Gఅలాగే 5G స్మార్ట్ ఫోన్లు రానున్నట్లు సాంసంగ్ గెలాక్సీ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే సాంసంగ్ స్మార్ట్ మొబైల్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు అద్భుతమైన ఫీచర్లతో.. అదిరిపోయే బడ్జెట్ ధరలతో త్వరలోనే కస్టమర్ల ముందుకు రానుంది . మరి ఈ స్మార్ట్ మొబైల్స్ ఈనెల జూలై 14వ తేదీన ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి స్పెసిఫికేషన్ లో కూడా దృవీకరించబడ్డాయి.
సాంసంగ్ గాలక్సీ M13 5G : స్మార్ట్ మొబైల్ ఫీచర్స్ 12 GB ర్యామ్ వరకు లభిస్తుంది ఫిజికల్ ర్యామ్ ప్లస్ తో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది. ముఖ్యంగా దీనిని వర్చువల్ ర్యామ్ అని కూడా పిలుస్తారు.. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తో రానున్నట్లు అమెజాన్ ఇండియా మైక్రోసెట్ ధ్రువీకరించింది. ఇక 6.5 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే తో ఈ స్మార్ట్ మొబైల్ రానుంది. ఇక మీడియా టెక్ డైమన్సిటీ 700 ఎస్ఓసి తో ఈ స్మార్ట్ మొబైల్ రానున్నట్లు సమాచారం. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ని కూడా ఈ స్మార్ట్ మొబైల్ కలిగి వుంది. కెమెరా విషయానికి వస్తే 50 MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ ఫీచర్లు ఉంటాయని సమాచారం. గ్రీన్, డార్క్ బ్లూ కలర్ లలో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. రూ. 15, 000 కన్నా చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
సాంసంగ్ గెలాక్సీ M13 4G : ఈ స్మార్ట్ మొబైల్ యొక్క కెమెరా గురించి ఇంకా రివీల్ చేయలేదు. 6000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానున్నట్లు ..15 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది 12 GB ర్యామ్ వరకు ఇది లభిస్తుంది. ఇక ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ తో 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి తో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది. ఇక 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ మొబైల్ ధర కూడా కేవలం రూ.15,000 కంటే తక్కువగా ఉండనున్నట్లు సమాచారం.