New SmartPhone : 150 W ఫాస్ట్ ఛార్జింగ్ తో సరి కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్..!!

New SmartPhone : ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చార్జింగ్ కూడా అంతే ఫాస్ట్ గా అయిపోతోందని కస్టమర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఒక సారి స్మార్ట్ ఫోన్ కి ఫుల్ గా చార్జి పెట్టాలి అంటే సుమారుగా గంటసేపు వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం అరగంటలోనే ఫుల్ చార్జ్ పొందే అవకాశం లభించింది. అది కూడా ఏకంగా.150 W ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం అరగంటలోపు ఫుల్ ఛార్జ్ అయ్యే ఒక స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల అవడం గమనార్హం. ఇక ఆ స్మార్ట్ ఫోన్ ఏదో కాదు వన్ ప్లస్ 10 సిరీస్.. మొబైల్ తయారీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన వన్ ప్లస్ తాజాగా 10 సిరీస్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు కేవలం అరగంటలోనే ఫుల్ చార్జింగ్ పొందవచ్చు. ఇక దీనికి ఓవల్ టైన్ అనే కోడ్ నేమ్ కూడా పెట్టినట్లు సమాచారం.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే..6.7 అంగుళాల ఫుల్ హెచ్ డి తో పాటు అమో ఎల్ఇడి డిస్ప్లే తో కూడా ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది. ఇక దీని స్క్రీన్ రిఫ్రెష్ రేటు 120 hz కాగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఇక ధర విషయానికి వస్తే వన్ ప్లస్ 10 ప్రో కంటే దీని తర్వాత చాలా తక్కువగానే ఉంటుందని సమాచారం. ఐ టి హోం వెబ్సైట్ కథనం ప్రకారం వన్ ప్లస్ 10 T స్మార్ట్ ఫోన్ ధర మొదట చైనాలో విడుదల చేసినప్పుడు దీని ధర సుమారుగా 3 వేల నుంచి 4 వేల యువాన్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇక మన భారత దేశ కరెన్సీ ప్రకారం ఈ వన్ ప్లస్ 10 T స్మార్ట్ ఫోన్ ధర రూ.35,000 నుంచి రూ.45,000 వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వన్ ప్లస్ 10 T స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం మన దేశ మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక కలర్స్ విషయానికి వస్తే బ్లాక్ , వైట్ , గ్రీన్ రంగులలో స్మార్ట్ఫోన్ మీరు సొంతం చేయవచ్చు.

New SmartPhone with 150W fast charging of Features
New SmartPhone with 150W fast charging of Features

ఇక ఈ స్మార్ట్ ఫోన్ నుంచి లీకైన సమాచారం ప్రకారం టచ్ స్లాపింగ్ రేటు 180 Hz ఉంటుందని సమాచారం. ఇక HDR 10 సపోర్ట్ కూడా ఇందులో అందించారు. స్టోరేజ్ విషయానికి వస్తే 12 GB RAM, 256 GB వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే.. ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సల్ ఉండగా 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, టు మెగాపిక్సల్ మైక్రో షూటర్ కూడా ఉంటుంది .. సెల్ఫీల కోసం వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. ఇక బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే 4800 ఎమ్ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం తో 150 W ఫాస్ట్ ఛార్జింగ్ మనం కూడా సపోర్ట్ చేస్తుంది. కేవలం అరగంట లోపే బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది. ఇక డ్యూయల్ స్పీకర్ సెటప్ తోపాటు బ్లూటూత్ వీ 5.3 కనెక్టివిటీ తో స్మార్ట్ఫోన్ లభిస్తుంది. ఇక సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా అందించనున్నారు. ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ఫోన్ ను మీరు మరికొద్దిరోజుల్లో సొంతం చేసుకోవచ్చు.