Business Idea : ఇంటి దగ్గర ఉంటూనే లక్షల్లో ఆదాయం..ఎలా అంటే..?

మనం ఏదైనా ఉద్యోగం చేయాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళక తప్పదు. బిజినెస్ మొదలు పెట్టాలన్నా సరే ఇంటి నుంచి బయటకు వెళ్లి మన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాల్సి ఉంటుంది.. ముఖ్యంగా ఇంటి నుండి బయటకు వెళ్లలేని ఎంతోమంది ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే మీకోసం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. ఈ బిజినెస్ తో ఇంటి దగ్గర ఉంటూనే లక్షలు లాభాన్ని పొందడమే కాకుండా మరి ఎంతోమందికి ఉపాధిని కూడా కల్పించవచ్చు . మరి ఆ వ్యాపారం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. ఇక మన దేశంలో ఎక్కడ చూసినా ఎక్కువగా డిమాండ్ ఉన్న వ్యాపారం పాల వ్యాపారం అని చెప్పవచ్చు. పల్లెల్లో కన్నా పట్టణాలలోని పాలకు , పాల ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంది.

అందుకే డైరీ ఫామ్ పెట్టి పాల వ్యాపారం చేస్తే కొన్ని లక్షల్లో డబ్బులను సొంతం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది ప్రతిభావంతులు, విద్యావంతులు కూడా ఇలా డైరీ ఫాం పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డైరీ ఫామ్ చేయడానికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున సహాయం అందిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాడి రైతులకు రాయితీలు అందిస్తూ వున్నాయి. పాలు ఇచ్చే ఆవులను, గేదెలను కొనుగోలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా మహిళల పేరుమీద రాయితీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ మీరు కూడా ఇలా డైరీ ఫాం పెట్టాలి అనుకుంటే మీ ఇంటిలో ఉన్న ఆడవారి పైన పేరు నమోదు చేయించి వారి పేరు పైన సబ్సిడీ తీసుకొని మరి పశువులను కొనుగోలు చేసుకోవచ్చు.  ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో హర్యానా వంటి రాష్ట్రాలలో పాడి పరిశ్రమ కోసం ఎవరైనా ఆవులు లేదా గేదెలను కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఒక్క గేదెకు రూ. 50,000, ఆవుకు రూ. 30 వేల రూపాయలు రుణం ఇస్తుంది. అంతేకాదు ఈ రుణంపై వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Modern Cow Dairy Farming Cow Milking in Business Idea
Modern Cow Dairy Farming Cow Milking in Business Idea

ఇక ఆ వడ్డీని కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే మీరు చెల్లిస్తే సరిపోతుంది . ఇక పాల ధర ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ పాల వ్యాపారం మొదలు పెడితే మంచి లాభాలు కూడా వస్తాయి. అయితే గేదెలలో మీరు ముర్రా జాతి గేదె లను కొనుగోలు చేస్తే పాలు ఎక్కువగా ఇస్తాయి . ఇక ఆవుల విషయానికి వస్తే జెర్సీ, అమెరికన్ ఆవులను కొనుగోలు చేయాలని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు రకాలు కూడా ఎక్కువ పాలు ఇవ్వడంతో పాటు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. పశువులకు ఆశ్రయం కల్పించడానికి తగినంత స్థలం కూడా ఉండాలి. ముఖ్యంగా మార్కెట్లో మంచిగా పాలు ఇచ్చే గేదె ధర రూ.70 వేలకు పైగా ధర పలుకుతోంది ముఖ్యంగా వీటికి ఎండు గడ్డి , పచ్చి గడ్డి, దాణా, నీళ్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి.

ఇక మీరు మీ ఊరిలో కి వచ్చే పాల వ్యాపారులతో కుదుర్చుకుంటే మంచి లాభాలు వస్తాయి లేదు సొంతంగా కొన్ని లాభాలు పొందాలి అనుకుంటే.. చిన్న స్థాయిలో డైరీ ఫార్మ్ పెట్టడానికి మీకు సుమారుగా మూడు లక్షలు పెట్టుబడి అవసరమవుతుంది . ఇక ఒక గేదె రోజుకు 12 లీటర్ల పాలు ఇస్తే ..ఆవు 18 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. మీరు 5 పశువులను పెట్టుకున్నా సరే రోజుకు వంద లీటర్ల వరకు పాలు పొందుతారు. ప్రస్తుతం ఒక లీటర్ పాల ధర 60 రూపాయలను అమ్మవచ్చు.. 100 లీటర్ల చూసుకుంటే రోజుకు 6 వేల రూపాయలను పొందితే నెలకు లక్షా ఎనభై వేల రూపాయలను పొందే అవకాశం. సుమారు 50 వేల రూపాయలను మీరు ఖర్చులకు ఉపయోగించినా మిగతా డబ్బులు సొంతం అవుతాయి. బిజినెస్ ఆలోచన ఉంటే ఇలాంటి బిజినెస్ మీరు చేయవచ్చు.