Belly Fat : బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

Belly Fat : ఇటీవల కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా వేలాడే పొట్ట తో ఇబ్బంది పడుతున్నారు. ఇక పోతే తమ ఆరోగ్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలా వేలాడే పొట్ట తగ్గించు కోలేక వారు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే సమయంలో కూడా పొట్టతో ఇబ్బంది పడుతూ ఇతరులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక అధిక బరువు, బెల్లీఫ్యాట్ అనే రెండూ కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తాయి. ఇక ఇష్టమైన దుస్తులు ధరించ లేక నలుగురులో సంతోషంగా మెలగలేక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే సమస్య వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కంటే సమస్య ఎలా వస్తుందో తెలుసుకుని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. ఇకపోతే మన శరీరంలో మనకు నచ్చనది బెల్లీ ఫ్యాట్ మాత్రమే. దీనిని వదిలించుకోవటం కోసం ఎన్నో వర్కౌట్లు, వాకింగ్, జాగింగ్ , ఎక్సర్ సైజ్ లాంటివి చేస్తూ నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అంతేకాదు ప్రత్యేకమైన డైట్ కూడా మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. ఇక తలచుకుంటే ఇదంతా పెద్ద పంచాయతీ అని చెప్పాలి. ఇక అసలు చూస్తూ చూస్తూ మనకు ఎందుకు అంత బెల్లీఫ్యాట్ అవుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా.. ముందుగా బెల్లీఫ్యాట్ రావడానికి గల కారణం కూడా తెలుసుకోవాలి. అప్పుడే వేలాడే పొట్టను తగ్గించుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. ఇకపోతే బెల్లీ ఫ్యాట్ అనేది ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇకపోతే బెల్లీఫ్యాట్ రావడానికి ట్రాన్స్ ఫ్యాట్ అనేది చాలా చెడ్డ కొవ్వు. ముఖ్యంగా బెల్లీఫ్యాట్ కి కారణం ఇదే అవుతుంది. మొత్తం మన శరీర బరువును పూర్తిగా పెంచేస్తుంది. ఇక తద్వారా మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ , దీర్ఘకాలిక వ్యాధులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ ట్రాన్స్ ఫ్యాట్ మన శరీరంలోకి చేరకుండా ఉండాలంటే కాల్చిన, ప్యాక్ చేసిన ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా అల్యూమినియం ఫాయిల్ లో చుట్టిన ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. వీటివల్ల ట్రాన్స్ ఫ్యాట్ మన శరీరంలోకి అధికంగా చేరుతుంది. కానీ తప్పని పరిస్థితుల్లో మీరు ఇలాంటి ఆహారం తీసుకున్నట్లైతే వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.

I wonder if you know the reasons for losing belly fat
I wonder if you know the reasons for losing belly fat

గంటల తరబడి కూర్చుని పనిచేయడం లేదా నిలబడి పని చేయడం లాంటి వాటి వల్ల కూడా బెల్లీఫ్యాట్ పెరిగిపోతుంది. శారీరక శ్రమ లేనప్పుడు బెల్లీ ఫ్యాట్ కరగడం అసాధ్యం. ఇక తప్పనిసరిగా ఇంట్లో కూర్చొని పని చేసే వాళ్ళు కనీసం గంటకు ఒకసారి 15 నిమిషాల పాటు అటూ ఇటూ నడవడం.. ఇంట్లో ఏదైనా తేలికపాటి పనులు చేసుకోవడం లాంటివి చేయాలి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడం.. వర్కౌట్స్ చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉండడమే కాకుండా కొవ్వును కూడా తగ్గించుకోవచ్చు. ఇక కనీసం రోజుకు 15 నిమిషాలైనా వ్యాయామం చేయడం అలవాటు గా పెట్టుకోండి.అధిక ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా శరీరం కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది జీవక్రియలను నెమ్మదించి చడం వల్ల బెల్లీఫ్యాట్ పెరుగుతుంది. కాబట్టి తక్కువ నిద్రకూడా కార్టిసాల్ ను పెంచుతుంది.

అందుకే రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. కాకపోతే మధ్యాహ్నం నిద్రించే సమయాన్ని తగ్గించుకోవాలి.ఇక ప్రశాంతమైన వాతావరణంలో నిద్రించడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇలాంటి సమస్యలు అన్ని దూరం అవుతాయి.ఇక మీరు తినే ఆహారపు అలవాట్లు కూడా బెల్లీ ఫ్యాట్ కు కారణం అవ్వచ్చు. ఎక్కువగా చక్కెర లు ఉండే పదార్థాలను తీసుకుంటే ఈ బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. బేకరీ ఐటమ్స్ , శుద్ధి చేసిన పిండి పదార్థాలు, పానీయాలు , స్వీట్ ఐటమ్స్ వంటి వాటి వల్ల శరీరంలో చెడు కొవ్వు పెరుగుతుంది. కాబట్టి వీటి జోలికి అసలు వెళ్ళకూడదు. ఆల్కహాల్ కూడా బెల్లీ ఫ్యాట్ ను పెంచుతుంది. ముఖ్యంగా మార్కెట్లో లభించే శీతల పానీయాలను కూడా దూరంగా పెట్టాలి. ఇవన్నీ బెల్లీ ఫ్యాట్ ను పెంచే కారకాలు.. కాబట్టి వీటిలో మీరు దేనికి బానిస అయ్యారో తెలుసుకొని వదిలించుకుంటే తప్పకుండా సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.