Business Idea : ఈ పంటతో రైతులకు లక్షల్లో లాభాలు.. ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా..!!

Business Idea : రైతులు మాత్రమే కాదు ఎవరైనా సరే కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లు అయితే..అందులో చాలామంది బిజినెస్ వైపే మొగ్గు చూపుతారు. వ్యవసాయం అనేది .. అత్యధిక పద్ధతులను ఉపయోగిస్తే వ్యవసాయం అంత సులభమైన పని మరొకటి లేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో చాలా మంది తక్కువ భూమిలోనే ఎక్కువ లాభాలను పొందుతున్నారు. అత్యాధునిక వ్యవసాయం చేయడం వల్ల ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలవడమే కాకుండా మంచి లాభాలను కూడా పొందవచ్చు. ఇకపోతే ఇప్పటికే చాలా మంది యువత అలాగే రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఇలా వ్యవసాయం చేసుకుంటూ లాభాలు పొందుతున్నారు. ఇకపోతే మీరు కూడా ఏదైనా వ్యాపారం లేదా వ్యవసాయం చేయాలి అనుకుంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పంటతో లక్షల్లో లాభాలు పొందవచ్చు. ఇక ఈ పంట వల్ల రైతులకు మంచి లాభాలు మాత్రమే కాదు పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు పంట ప్రారంభించడానికి రైతులకు 75 శాతం సబ్సిడీ కూడా ప్రభుత్వం నుంచి మనం పొందవచ్చు.

ఇకపోతే మీరు కూడా లక్షల్లో డబ్బు సంపాదించాలని చూస్తున్నారా ..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియాలు .. మీరు కనుక ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అయితే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎవరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం లేకుండా భవిష్యత్తులో మీ కాళ్ల మీద మీరు నిలబడవచ్చు.మరి అయితే ఈ బిజినెస్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..చాలామంది పంటలు పండించి చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్న నేపథ్యంలో మీరు కూడా ఎలాంటి రిస్క్ లేకుండా బొప్పాయి సాగు తో మంచి రాబడిని పొందవచ్చు. ఇదివరకే ఎంతో మంది యువత అలాగే రిటైర్డ్ ఆఫీసర్లు కూడా బొప్పాయి సాగు చేసి మంచి లాభాలను పొందుతున్నారు. బిజినెస్ గురించి పూర్తి వివరాలు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 6 మిలియన్ టన్నుల బొప్పాయి ప్రతి ఏడాది ఉత్పత్తి అవుతుంది. ఇక మన దేశంలోనే ఏకంగా మూడు మిలియన్ టన్నుల బొప్పాయి ఉత్పత్తి అవుతోంది. బొప్పాయి తినే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.

Business Idea Millions of profits for farmers with this crop
Business Idea Millions of profits for farmers with this crop

కరోనా వచ్చిన తర్వాత వీటి డిమాండ్ బాగా పెరిగింది అని చెప్పవచ్చు. అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ బొప్పాయి పండు ఎప్పటికీ కూడా డిమాండ్ తగ్గిందనే చెప్పాలి.డిమాండ్ తగ్గని వ్యాపారం కాబట్టి ఇందులో మనం కచ్చితంగా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. బొప్పాయి వల్ల ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఎన్నో రకాల మందులలో కూడా వీటి ఆకులను, గింజలను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చర్మ సౌందర్య సాధనాలలో కూడా బొప్పాయి కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సబ్బులు, ఫేస్ వాష్ లు తో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా బొప్పాయి పండు ని ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఈ వ్యాపారం ద్వారా మీకు ఎప్పుడూ కూడా నష్టం వాటిల్లదు.ముఖ్యంగా ఈ పంట కోసం జూలై నుంచి సెప్టెంబర్ లేదా ఫిబ్రవరి నుంచి మార్చి నెలలు అనుకూలం.

ఒక హెక్టారు లో మీరు సాగు చేయాలి అంటే లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇక మే-జూన్ సీజన్లో నీళ్ళు పోస్తూ మొక్కలను బాగా కాపాడుకుంటే మంచి దిగుబడి రావడమే కాకుండా తాజా పండ్లు లభిస్తాయి.ఈ పంట వల్ల ఎక్కువ లాభం కూడా వస్తుంది. ముఖ్యంగా బీహార్ ప్రభుత్వం అయితే ఏకంగా 75 శాతం వరకు బొప్పాయి పంట సాగు చేసుకోవడానికి రైతులకు సబ్సిడీ ఇస్తోంది. కాబట్టి బొప్పాయి చెట్ల ద్వారా మంచి లాభాలను సంపాదించుకోవడమే కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని చెప్పవచ్చు. ఎప్పటికీ డిమాండ్ ఉండే ఈ పంట ద్వారా ప్రతి ఒక్కరికి లాభాలు అధికం. కష్టం తక్కువ లాభం ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు జీవితాలను మార్చే ఈ వ్యాపారం అద్భుతమైన దిగుబడిని ఇస్తుందని చెప్పవచ్చు .