Kuberadu : ఇంట్లో ఆ దిశలో మట్టి కుండను ఏర్పాటు చేస్తే కుబేరుడు మీ ఇంటే..?

Kuberadu : పూర్వకాలంలో చాలామంది మట్టికుండలో ఏర్పాటు చేసిన నీటిని తాగడం లేదా మట్టి కుండలను ఉపయోగించి వంటలను తయారుచేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇకపోతే మట్టి కుండల ద్వారా తయారు చేసిన వంటలు తినడం వల్ల రుచికి రుచి లభించడంతోపాటు పోషకాలు కూడా లభిస్తాయి. ఇక ముఖ్యంగా మట్టి కుండలో నీటిని నింపి ఇంట్లో పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని, కుబేర స్థానం లో పెట్టడం వల్ల ఆర్థిక సంపద పెరుగుతుంది అని చెబుతున్నారు పండితులు. ఇక ఇంట్లో ఆ దిశలో మట్టికుండను కనుక మీరు ఏర్పాటు చేస్తే కుబేరుడు ఆ దిశలోనే ఉంటాడు అని శాస్త్రం చెబుతోంది.

వాస్తు శాస్త్రం ప్రకారం మట్టితో తయారుచేసిన కుండలను సరైన రీతిలో ఉపయోగించినట్లయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇక ఈరోజు మట్టికుండను ఏ దిశలో ఏర్పాటు చేయడం వల్ల సంపద పెరుగుతుంది అనే విషయానికి వస్తే.. వాస్తు శాస్త్రం ప్రకారం కుండలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకాలు లభించడంతో పాటు శరీరంలో వేడి తగ్గిపోతుంది. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి.. సుఖసంతోషాలు చేకూరుతాయి. ఇక మట్టి కుండలో నీరు మంచి సువాసనతో పాటు రుచిని కూడా అందిస్తాయి.

Kuberadu if a clay pot is set up in that direction in the house
Kuberadu if a clay pot is set up in that direction in the house

మట్టితో తయారు చేసిన వస్తువులు గృహ పరిస్థితులను మార్చడానికి సహాయపడతాయి. దుష్ట గ్రహాలు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఇక ఇంట్లో మట్టికుండను ఏర్పాటు చేయడం వల్ల బుధుడు, చంద్రుడు స్థానాన్ని బలపరుస్తుంది అని ఇంట్లో పరిస్థితులు సానుకూలంగా మారుతాయని చెబుతారు. ఇకపోతే మట్టికుండను ఖాళీగా ఎప్పుడూ ఉంచకూడదు. నీటితో మాత్రమే నింపినప్పుడే దానికి శుభ ఫలితాలు పొందవచ్చు. ఇంట్లో ఉత్తరదిక్కు వైపున మట్టి కుండలో నీటిని నింపి కుండను ఏర్పాటు చేయడం వల్ల కుబేర స్థానం బలపడి ఇంట్లో కుబేరుడు ప్రవేశిస్తాడు. కుబేర యోగం పట్టింది అంటే ఇక సిరిసంపదలకు కష్టం ఉండదు అని చెప్పవచ్చు.