Zodiac Signs : హిందూ శాస్త్రం ప్రకారం జ్యోతిష శాస్త్రంలో శని దేవుడి సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కుంభ రాశి, మకర రాశి అధిపతి అయిన శని దేవుడు 2022 ఏప్రిల్ 28వ తేదీన తన మొదటి రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించడం జరిగింది . ఇక దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు శని దేవుడు కుంభరాశిలో ఉంటాడు. మిగతా గ్రహాల తో పోల్చుకుంటే శని గ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది. అయితే శనిగ్రహం నెమ్మదిగా కదులుతున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం మిగతా రాశులపై తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇకపోతే శనిదేవుడిని కర్మ ప్రదాత అని, న్యాయ దేవుడిగా కూడా భావిస్తారు. అంతేకాదు వ్యక్తులు చేసే కర్మానుసారంగా ఫలితాలను ఇవ్వడంలో శని దేవుడు ముందు ఉంటాడు.
న్యాయాధిపతి అయిన శనిదేవుడు మేషరాశిలో నీచ స్థానంలో.. తులారాశిలో ఉన్నత స్థానమును పొందుతాడు .. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయి. సింహ రాశి, కన్యా రాశుల వారికి విశేష ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా శనిదేవుడు సింహరాశి వారి ఏడవ ఇంటిలో అంటే వివాహిత గృహంలో మార్పు చేసుకుంటాడు.. అందువల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారం మొదలు పెట్టడమే కాకుండా పనిలో పురోగతి ఉంటుంది. సింహ రాశి వారు మీ తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి.
కన్యా రాశి వారిలో శని మార్పు ఆరవ ఇంటిలో జరుగుతుంది. కాబట్టి శత్రువు, రుణం, వ్యాధికి సంబంధించి మీరు బయట పడతారు.. కష్టాలు ఉంటే తీరిపోతాయి. శత్రువులపై విజయం మీదే అవుతుంది. అదే సమయంలో లో కిడ్నీ లో రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి, కాళ్ళనొప్పులు వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. శని పూజలు చేసినట్లయితే తప్పకుండా సంపద కూడా పెరుగుతుంది.
ఇక ఇలాంటి రాశులవారి అందరికీ కూడా ఈ ఆర్టికల్‌ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి జాగ్రత్తలు సూచించగలరు.