Lakshmi Devi : లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలి అంటే..?

Lakshmi Devi : లక్ష్మీదేవి.. ధనవంతులైనా.. కటిక పేదవారైనా లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మ అనుగ్రహిస్తే తిరుగు ఉండదు .. కానీ ఒకవేళ అమ్మ ఆగ్రహం వ్యక్తం చేసిందంటే కోటీశ్వరుడు కూడా క్షణాల్లో కటిక పేదవాడు అవుతాడు అనడంలో ఎన్నో ఉదాహరణలు మనకు తారసపడతాయి. లక్ష్మీదేవిని ఎంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారో అమ్మవారి అనుగ్రహం అంత ఎల్లవేళలా మీపై ఉంటుంది. ఇక లక్ష్మీదేవిని విష్ణుమూర్తి తో కలిపి పూజించడంవల్ల సకల భోగాలు, సిరి సంపదలు తులతూగుతాయని శాస్త్రం చెబుతోంది. హిందూ పురాణం ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

లక్ష్మీదేవి సాగర మథనం నుంచి జన్మించినప్పటికి ఆమె నిరంతరం కమలాసుని గా దర్శనమిస్తోంది. ధనం , శాంతి, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీకగా లక్ష్మీదేవిని పరిగణిస్తారు. ఆది , ధాన్య, ధైర్య, గజ, సంతాన, విజయ, విద్య, ధన లక్ష్మి అనే ఎనిమిది రూపాల్లో లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలని ఆరాధిస్తారు. లక్ష్మీ దేవి విగ్రహానికి.. తప్పకుండా పూజలు చేస్తూ ఉంటారు. నిత్యం లక్ష్మీ దేవి ని పూజ చేయాలి అంటే.. ఇక అమ్మవారి పటం ఎలా ఉండాలి అనే విషయాలను కూడా మీరు గమనించాలి. మనం పూజించే లక్ష్మీదేవిరూపం యవ్వనంతో ఉండే.. ఎంతో చక్కని కనుబొమ్మల తో ఎర్రని పెదాలతో గుండ్రని ముఖం తో దివ్య వస్త్రాభరణాలతో చూపరులను ఆకట్టుకునేలా ఉండాలి.

Does it mean that Lakshmi Devi should be at home constantly
Does it mean that Lakshmi Devi should be at home constantly

ఇక ఎడమచేతిలో పద్మం , కుడిచేతిలో బిల్వ ఫలాలతో.. పద్మాసనంలో కూర్చుని ఉన్న లక్ష్మీదేవి రూపాన్ని పూజించాలి అని మనకు పురాణం చెబుతోంది. లక్ష్మీదేవి కొన్ని పటాలలో నిలబడి ఉన్నట్లు మనకు దర్శనమిస్తుంది. అలాంటి పటాలను పూజించకూడదు కేవలం అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చోని వుండే.. అమ్మవారి పటాన్ని మాత్రమే పూజించాలి అని పురాణం చెబుతోంది. ఇలా పద్మాసనం వేసుకుని కూర్చున్న అమ్మవారి ఫోటోలు ఇంట్లో పెట్టుకొని పూజించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆర్టికల్స్ అవసరం అవుతాయి కాబట్టి అందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.