Eye Sight : కంటి చూపును మెరుగు పరిచే దివ్యౌషధం..!

Eye Sight : కంటిచూపు దేవుడిచ్చిన వరం అని చెప్పవచ్చు.. కంటి చూపు లేనిదే దేనిని చూడలేము.. సాధించలేము అందుకే కంటిచూపును మెరుగు పరుచుకోవాలి అని కంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ల్యాప్టాప్ , సెల్ ఫోన్, టీవీ లాంటివి అధికంగా చూడడం వల్ల వాటి నుంచి వచ్చే బ్లూ రేస్ కంటిలో ఉన్న పొర పై పడి కంటిచూపును క్రమంగా తగ్గిస్తాయి. అందుకే కంటి చూపు మెరుగు పడాలంటే ప్రతిరోజు కంటి వ్యాయామం చేయాలి అని యోగా నిపుణులు కూడా చెబుతున్నారు. కంటి చూపును మెరుగు పరిచే ఒక దివ్య ఔషధం కూడా మీ ముందుకు ఈ రోజు తీసుకురావడం జరిగింది.

ప్రతి రోజు ఒక పొడిని గ్లాసు పాలలో కలుపుకుని తాగారు అంటే చాలు మీ కంటి చూపు అమాంతం పెరుగుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే పొడిని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే..50 గ్రాముల సొంపు, 50 గ్రాముల బాదం పప్పు,10 గ్రాములు తెల్ల మిరియాలు, 100 గ్రాముల పటికబెల్లం, 4 యాలకులు తీసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడి కలిపి తాగాలి. సొంపు కంటిచూపును మెరుగు పరచడానికి.. కంటి శుక్లాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది.

Remedy to improve Eye Sight
Remedy to improve Eye Sight

తెల్ల మిరియాలు కంటి సంబంధిత సమస్యలను నయం చేయడానికి సహాయపడుతాయి. ఇక బాదం పప్పు, పటికబెల్లం రెండూ కూడా కంటి చూపును మెరుగు పరచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ పొడిని ప్రతిరోజు తాగినట్లయితే కంటి సంబంధిత సమస్యలు దూరం కావడమే కాదు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నట్లయితే ప్రతిరోజు గ్లాసు పాలలో ఒక చెంచా పొడిని కలిపి వారికి తాగించడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరిగి బుద్ధిమాంద్యత సమస్య దూరమవుతుంది. పిల్లల కంటి చూపు కూడా సమర్థవంతంగా ఉంటుంది.