Hair Benefits : మామిడి టెంకతో అందం, కేశ సౌందర్యం కూడా..!

Hair Benefits : మామిడి పండు ఈ పేరు చెప్పగానే నోట్లో లాలాజలం ఊరుతుంది కొందరికి.. వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ.. మనందరం మామిడి పండ్లు తిని అందులో ఉండే టెంకను పారేస్తం.. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే మామిడి టెంక లో కూడా బోలెడు పోషక విలువలు ఉన్నాయి.. అవి ఆరోగ్యం తో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తాయి.. మామిడి టెంక వలన అందం రెట్టింపు ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

మామిడి టెంక లో విటమిన్ బి ఉంటుంది. ఇది చర్మం పై ముడతలు, మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల తాకిడికి నుంచే తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. మామిడి టెంక లోని పొటాషియం చర్మానికి తేమను అందిస్తుంది. పొడిలో వెన్నను కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది. మీరు ఉపయోగించే ఫేస్ ప్యాక్ లో ఈ పొడిని కలిపి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Skin and Hair Benefits of Mango Nuts
Skin and Hair Benefits of Mango Nuts

మామిడి టెంక లో ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్,విటమిన్స్ జుట్టుకు పోషణనిస్తాయి. వెంట్రుకలను దృఢంగా పెరిగేలా చేస్తాయి. తెల్లజుట్టు కు ఈ టెంక పొడిలో కొబ్బరి, ఆలివ్, ఆవ నూనె సమపాళ్ళలో తీసుకుని కలపాలి. ఈ నూనె జుట్టుకు రాసుకుంటే కురులు నల్లగా మారుతాయి. చుండ్రు సమస్య తో బాధపడుతున్న వారు మామిడి టెంక పొడిని కొబ్బరి నూనె లో కలిపి రాసుకోవాలి. ఇలా తరచూ రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది.