Diabetes : డయాబెటిస్ శాపంగా మారిందా.. అయితే ఇలా చేయండి..!!

Diabetes : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ స్టైల్ ను గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని విషపు అలవాట్లకు బానిస అవుతూ ఉండడం గమనార్హం.బిజీ లైఫ్ స్టైల్లో సరైన సమయానికి తినకపోవడం.. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం లేదా నిలబడడం.. సరైన సమయానికి వ్యాయామం, యోగా లాంటివి చేయలేకపోవడం.. శారీరక శ్రమ లేకపోవడం ఇలాంటి వాటివల్ల చిన్న వయస్సు నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఎక్కువగా తలెత్తుతున్న సమస్యలలో కూడా ఒకటి. గతంలో చక్కెర వ్యాధి అంటే చాలామంది భయపడేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి సాధారణమైన వ్యాధిగా మారి పోయింది. ముఖ్యంగా శారీరక శ్రమ లేక పోయిన వారు.. ఒత్తిడిని , ఆందోళనలకు ఎక్కువగా గురయ్యే వారికి ఈ సమస్య అధికంగా వస్తుందట.

ముఖ్యంగా చక్కెర ను అధికంగా వాడడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోయి డయాబెటిస్ వచ్చే కారణం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది. ఇకపోతే డయాబెటిస్ వ్యాధి వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే.. గొంతు ఆరిపోవడం .. ఎక్కువగా దాహం వేయడం.. అలసట, నీరసంగా అనిపించడం , ఎక్కువగా ఆకలి వేయడం, ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా ఉన్నట్టుండి బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. అంతే కాదు ఎప్పుడైనా తేలికపాటి గాయాలు అయినప్పుడు అవి త్వరగా మానకపోతే రక్త పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.

Diabetes has become a curse but do it like this 
Diabetes has become a curse but do it like this

ఇక ఇలాంటి డయాబెటిస్ ను మీరు ముందే గమనించి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ మహమ్మారి నుంచి కొంత వరకు బయట పడవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి సమస్యను ముందుగానే గుర్తించాలి. పూర్తిగా జంక్ ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. అధికంగా ఉండే తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. ఇక సాధ్యమైనంత వరకు తక్కువ మోతాదులో అన్నం తినడం.. అన్నం కి బదులుగా.. రొట్టెలు, సజ్జలు, ముద్ద , రాగిజావ , జామకాయ, నట్స్, ఆకుకూరలు వంటి వాటిని తినడం వల్ల డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవచ్చు.