Eswar chandra vidyasagar: ఈశ్వర్ చంద్ర బాల్యం:
ఈశ్వర్ చంద్ర పశ్చిమ బెంగాల్ లో బిర్సింగా గ్రామం లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబములో పుట్టారు. ఆయన చిన్నతనం అంతా పేదరికముతో గడుపుతూ నే అపారమైన పుస్తకజ్ఞానము సంపాదించుకున్నారు.తన తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావడము చేతవలన కొడుకు కూడా ఆదే వృత్తిని చేపట్టాడు. మొదట వారుంటున్న గ్రామంలోని పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత కాలం లో తండ్రికి కలకత్తాలో ఉద్యోగము దొరకడముతో 1828 లో కలకత్తాకు వెళ్లిపోయారు. వారి చుట్టం అయిన మధుసూదన్ వాచస్పతి, ఈశ్వర్ ను సంస్కృత కళాశాలకు పంపమని కోరగా అక్కడికి పంపడం అనేది జరిగింది.
Eswar chandra vidyasagar: అన్నికులముల పిల్లలకు:
1839 వ సంవత్సరం లో హిందూ న్యాయశాస్త్రములో ఉత్తీర్ణుడైనారు. రెండు సంవత్సరముల తరువాత ఫోర్ట్ విలియం కాలేజీలో ప్రధాన సంస్కృత పండిత పదవిని పొందగలిగారు. ఆయన సంస్కృత కళాశాలలో అన్నికులముల పిల్లలకు విద్య నేర్పించాలని, స్త్రీల విద్యాభ్యాసానికి కూడా ప్రోత్సహించాలని పోరాటము చేయడం మొదలు పెట్టారు. ఈశ్వర్ చంద్రకు భయము అనేది లేకపోవడము చేత, ఆతను బ్రాహ్మణుడు కావడము చేత సంస్కృత కాలేజీ యాజమాన్యమునకు ఇబ్బంది పెరగసాగింది. దానితో 1849 వ సంవత్సరం లో కాలేజీ లో రాజీనామా చేసారు.
20 స్కూళ్ళను నెలకొల్పారు:
ఒక సంవత్సరము తరువాత విద్యా విభాగములో అతని కోసము ఏర్పరిచిన సాహిత్య టీచర్ పదవి దక్కింది. అయన ఆ కాలేజీలో పైన చెప్పిన మార్పులు రావాలని కోరుకున్నారు. పాఠశాల ఇన్స్‌పెక్టర్ పదవిలో 20 స్కూళ్ళను నెలకొల్పారు. ఆ తరువాత ఫోర్ట్ విలియమ్స్ కాలేజీ మూతబడి కలకత్తా విశ్వవిద్యాలయము ప్రారంభము కాగా విద్యాసాగర్ దానికి స్థాపక సభ్యుడయ్యెను. ఆప్పటికే ఈశ్వర్ చంద్ర స్త్రీ హక్కుల కొరకు పోరాటముమొదలు పెట్టారు.
విద్యాసాగర్ గురించి స్వామి వివేకానంద:
విద్యాసాగర్ ఔన్నత్యము తో పాటు విశాల హృదయము కలవాడని ఆయన గురించి తెలిసిన ప్రతిఒక్కరు ఒప్పుకునే మాట. ఆ రోజుల్లో ఉన్న చాలామంది సంస్కర్తల మాదిరి విద్యాసాగర్ ధనవంతుడు కాదు. ఆనాటి ధనికులకున్న అహంకారము ఆయనకు లేకపోవడము వలన సమాజములో అదృష్టము లేనివారి పై కనికరము చూపగలిగారు. చిన్న వారిదగ్గర మొదలు కొని పెద్ద వారి వరకు ఆందరికీ సహనము, వినయము ల తో ఉండడం నేర్పించారు. ఒకసారి స్వామి వేవకానంద మాట్లాడుతూ ఉత్తర భారత దేశములో విద్యాసాగర్ నీడ సోకని నా వయస్సు కలవాడు ఎవ్వడూ లేడు అని అన్నారు.
స్త్రీల జీవనగతినిమార్చడానికి:
స్త్రీల జీవనగతినిమార్చడానికి విద్యాసాగర్ చేసిన అలుపెరగని ఉద్యమాల యొక్క ఫలితాలు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయి అనడం లో ఎలాంటి సందేహము లేదు. విద్యా సాగర్ కాలములో బ్రహ్మ సమాజం నాయకులైన రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్ర సేన్ ,దేవేంద్ర నాథ్ ఠాగూర్ క్రైస్తవ మతముకు చెందిన అలెగ్జాండర్ డఫ్, కృష్ణ మోహన్ బెనర్జీ లాల్ బీహారీడే వీళ్ళందరూ కుడా సమాజ సంస్కరణ కోసం ప్రయత్నం చేస్తూఉండేవారు. అయితే విద్యాసాగర్ వారిలా క్రొత్త, ఇతర సమాజములు , సంస్కరణ పద్ధతులు తీసుకురాకుండా , హిందూసమాజము లోలోపలనుండేమార్పుతీసుకురావడానికి కృషి చేసారు.
అణగదొక్కబడిన స్త్రీల స్థితిని మార్చడానికి:
విద్యాసాగర్ ప్రఖ్యాత సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్‌గా పండితులను శాస్త్రములు చదివి వాటి అర్థములను సామాన్య మానవులకు చెప్పేలా ప్రోత్సహించారు. శాస్త్రములు చదువుట వలన, పందొమ్మిదవ శతాబ్దములో అణగదొక్కబడిన స్త్రీల స్థితిని మార్చడానికి హిందూ ధర్మ శాస్త్రం ఒప్పుకోదని , అధికారము కలిగిన వారి మూర్ఖత్వమే దీనికి కారణమని తెలుసుకున్నారు. న్యాయశాస్త్రం లో స్త్రీలకు ధనము, సంపాదనలో వారసత్వము,వారి స్వతంత్రత, విద్యలలో సమాజమునకు ఎంత అయిష్టత ఉన్నది అనే విషయాన్నీ కనిపెట్టగలిగారు.
వితంతు వివాహము:
అప్పటివరకూ బ్రహ్మసామాజములో అప్పుడప్పుడు అక్కడక్కడా జరుగే వితంతు వివాహములను ప్రధాన హిందూ సమాజములోకి విద్యాసాగర్ ఒంటిచేత్తో తీసుకురాగలిగారు.
బాల వితంతువుల కష్టాలు:
బెంగాలీ కులీన బ్రాహ్మణులలో బహుభార్యత్వము బాగా ఎక్కుగా ఉండేది. మరణానికి దగ్గరగా ఉన్న ముసలివారైన మగవారు యువతులను ఇంకా చెప్పాలి అంటే చిన్నపిల్లలను, పసి పిల్లలను కూడా పెళ్ళిచేసుకోవడానికి సిద్ధం గా ఉండేవారు. ఆడపిల్ల పుట్టింట పెద్ద మనిషవడం అనేది ఒక సిగ్గుపడవలసిన విషయం గా భావిచేవారు. ఇది బాల్య వివాహాలకు ఒకసాకుగా మారింది. పెళ్ళయిన కొద్దికాలంలోనే భర్త మరణిస్తే ఆ పిల్లను పుట్టింటింటికి తీసుకువచ్చి వదిలేసేవారు. అప్పుడు ఆ ఆడపిల్లను కన్నవారు పెళ్ళి ఖర్చులు, కట్నాలు భరించడమే కాకుండా జీవితాంతం ఆ పిల్ల బాగోగులు చూసుకోవాలిసి వచ్చేది.
ఇక ఆ పిల్లలు చిన్న తనం లోనే భర్తను కోల్పోవడం తో జీవితాంతం దుర్భరమైన వైధవ్యం లో బ్రతకాలిసి వచ్చేది. అలాంటివారికి పేదరికము,వేదన, కట్టుబాట్లు, వివక్షత వారి జీవితంలో భాగంగా ఉండేవి. ఇక వారు మాంసం, చేపలు, ఉల్లి, వెల్లుల్లి తినడం నిషిద్ధం గా ఉండేది. ఉదయాన్నే అందరికంటే ముందు లేచి చన్నీటి స్నానం చేసి, తడి చీర కట్టుకొని మంచు ఆరని పూలను కోయవలిసి ఉండేది. ఇంట్లో అందరికంటే వారిదే ఆఖరి భోజనం, లేదా ఉపవాసం ఉండవలసి వచ్చేది. పురుషులను ఆకర్షించకుండా ఉండడానికి జీవితాంతం గుండు చేసుకుని , తెల్లచీర కట్టుకుని , ఇంకెవరికీలేనన్ని ఆంక్షల తో పాటు , పూజానియమాలు కూడా వారికి అంతకట్టబడ్డాయి. చాలా మంది వితంతువులు ఇంటినుండి వెళ్లగొట్టబడి వారాణసి లేదా బృందావనం చేరి, ప్రార్థనతో పరిశుద్ధులవ్వాలనే తలంపుతో అక్కడ తలదాచుకొనేవారు. అయితే వారిలో చాలామంది వేశ్య వృత్తికి, లేదా మగవారి అత్యాచారాలకు గురైపోయేవారు. ఆధారంలేని ఆ స్త్రీలు దుర్భరమైన జీవితాన్ని గడిపేవారు.
వితంతుపునర్వివాహ చట్టం :
1856 వ సంవత్సరం లో విద్యాసాగర్ వితంతుపునర్వివాహ చట్టం ప్రతిపాదించడం తో పాటు దాని అమలుకు అన్నివిధాలుగా కృషిచేశారు. అదే సంవత్సరం డిసెంబరులో సంస్కృత కళాశాలలో విద్యాసాగర్ తో పాటు ఉద్జ్యోగం చేసే శ్రీష్‌చంద్ర విద్యారత్న ఈ చట్టం క్రింద మొదటిసారి ఒక వితంతువును పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళిని కుదిర్చిన విద్యాసాగర్ ఈ చట్టం అమలు చేయడం కోసం నిర్విరామంగా కృషి చేసారు. సంప్రదాయ పురోహితులు వెలివేసిన అలాంటి పెళ్ళిళ్ళకు స్వయంగా తానె పురోహితునిగా మారి పెళ్లిళ్లు జరిపించేవారు. తన కొడుకు ఒక వితంతువును పెళ్లి చేసుకోవడానికి కారణం అయ్యారు. పెళ్ళి చేసుకోలేని వితంతువుల సహాయార్ధం ఒక నిధిని కూడా ఏర్పాటు చేశారు. చాలా మందికి వితంతు వివాహాలకు ఆయన స్వయంగా డబ్బు అందచేసి ఆర్థికమైన ఇబ్బందులలో పడ్డారు .
సంస్కృత ముద్రణాలయము:
1847 వ సంవత్సరం లో విద్యాసాగర్ సంస్కృత ముద్రణాలయము, తాళ పత్ర గ్రంథములను భద్రపరచు కేంద్రము ను కలకత్తాలోని అమ్హెర్స్ట్ వీధి లో 600 రూపాయల అప్పు చేసి మరి ప్రారంబించారు. కృష్ణసాగర్ జమిందారుల వద్ద ఉన్న ఆనందమంగళ కావ్యము, ఆ తరువాత భేతాళ పంచవింశతి అంటే ప్రముఖ విక్రమభేతాళ కథలు ని సంస్కృత కథా చరిత సాగర్ నుండి అనువాదం జరిగింది. 1849 లో మిత్రుడు మదన్ మోహన్ తర్కాలంకార్ తో కలిసి పిల్లల బొమ్మల కథలు శిశు శిక్ష ప్రారంబించారు. భో ధో ధో య్ జ్ఞానము యొక్క సూర్యోదయము అనే రచన చేసారు. ఆ తరువాత ఐదు సంవత్సరముల కు వర్ణ పరిచయం అంటే బెంగాలీ అక్షర సంగ్రహము ను రచించెను. ఆ పాఠ్యపుస్తకమునుఇప్పటికి కూడా బెంగాలీ పిల్లలు ఎలిమెంటరీ పాఠశాలలో వాడుకుంటున్నారు.
విద్యాసాగర్, తర్కాలంకార్ సర్వ వ్యాప్తమైన శిశు భోదకము, బాల బోధము,వర్ణ బోధము , ఇతర పాఠ్య పుస్తకములను,అర్థశాస్త్ర శ్లోకములు,జానపదములు, సామెతలు, శాప విమోచన మార్గములు, మహా పురాణాల నుండి కథలు పుస్తకములుగా మార్చడానికి కృషి చేసేవారు. విద్యాసాగర్ బెంగాలీలో టైపు చేయు విధానమును 12 అచ్చులు, 40 హల్లులలో అమర్చారు. ప్రింటర్లు టైపు చెయ్యలేని ఆసాధారణ, సంయుక్త అక్షరములను లను సులభము చెయ్యడానికి ఖర్చుతో కూడిన పెద్ద ప్రయత్నమే చేసారు. దానికి బదులు చూపించలేక పోవడము వలన ఇందులో విజయం సాధించలేక పోయారు. 1857 వ సంవత్సరం లో సంస్కృత ప్రెస్ లో 84, 200 పుస్తకముల కాపీలను అచ్చు వేసి అమ్మడం జరిగింది.
వారసత్వముగా లేదా సొంతముగా గాని ఆస్తి లేకపోవడము వలన విద్యాసాగర్ కు, సంస్కృత ముద్రణాలయం విజయవంతం అవడం చాలా అవసరం గా ఉండేది. అంతే కాకుండా బెంగాలీ ప్రజలతోమాట్లాడటానికి ఒక సాధనమును కూడా ఏర్పాటు చేసుకున్నారు.
సంస్కరణ ఆలోచనలను వేరే వారి మీద రుద్దకుండా :
విద్యాసాగర్ పదములను ఆ గడ్డమీద పుట్టిన ప్రతీ ఒక్కరికి అందచేశారు. ముద్రణాలయం లో గిరాకీ పెరగడము తో విద్యాసాగర్ కు వ్రాయాలన్న ఉత్సహం కలిగింది.అయన ఇవ్వాలనుకున్న సందేశములను పుస్తకముల ద్వారా అందించడం, పాఠాలు నేర్పడం తో పాటు మానవతా వాద కార్యములకు కూడా అది పనికి వచ్చింది. విద్యాభ్యాసము ద్వారా సంఘ సంస్కరణ ఆలోచనలను వేరే వారి మీద రుద్దకుండా వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా ఉదాహరణగా జనులకు చూపించడానికి అవకాశం కలిగింది.
విద్యాసాగర్ మేళా:
విద్యాసాగర్ మేళా, విద్య, సమాజము రెండిటి గురించి జ్ఞానము పంచే పండుగ అని చెప్పాలి. అయన జ్ఞాపకార్థము 1994 వ సంవత్సరం నుండి ప్రతీ సంవత్సరము ఇది జరుగుతున్నది. 2001 వ సంవత్సర నుండి కలకత్తా, బీర్సింఘా లలో జరుపబడుతున్నది.విద్యాసాగర్ 70 సంవత్సరాలు వచ్చిన తరువాత 1891 జులై 29 లో మరణించారు.
విద్యాసాగర్ జీవితం లో కొన్ని ముఖ్య విషయాలు:
విద్యాసాగర్ గారికి వచ్చిన బిరుదులు.. చాంపియన్ ఆఫ్ ఉమెన్స్, పండిట్, విద్యాసాగర్, రిఫార్మర్ ఆఫ్ ఇండియా.ఆయనకు కలకత్తాలోని సంస్కృత కళాశాల విద్యాసాగర్ అను బిరుదును ఇచ్చింది.ది హిందూ ఫ్యామిలీ ఫండ్ అనే ఒక సంస్థను విద్యాసాగర్ స్థాపించారు.1851 వ సంవత్సరం లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తా సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్ అయ్యారు. బెంగాలీ లో సోమ్ ప్రకాష్ అనే వార పత్రికనుమొదలు పెట్టారు.బెంగాలీ ప్రాథమిక వాచకం పుస్తకాన్ని రచన చేసారు. దీన్ని బెంగాల్ పాఠశాలలో ఇప్పటికీ బోధించడం విశేషం గా చెప్పబడింది. అలాంటి మాహానుభావుల గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ఈశ్వర్ చంద్ర తన పట్టుదలతో వ్యవస్థలో ఎన్నోరకాలుగా మార్పులు తీసుకువచ్చి మహనీయుడిగా నిలిచారు. ఆకాలం నుండి ఇప్పటి వరకు ఆయన పాఠ్యపుస్తకాలు మాత్రమే కొనసాగుతున్నాయి అంటే ఆయన కృషి అలాంటిది.