Health Benefits : ఈ నూనె మన పెద్దల ఆరోగ్య రహస్యం..!

Health Benefits :  మన పూర్వికుల ఆరోగ్య రహస్యం ఆముదం అని మీకు తెలుసా..! సుమారు 2000 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు..! ఆముదంలో తెలుగు, ఎరుపు, పెద్దాముదం అనే రకాలు ఉన్నాయి.. ఆముదం వలన మనకు తెలియని బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అవెంటో ఇప్పుడు చూద్దాం..!ఆముదం ఒంటికి రాసుకుని పదిహేను నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే హాయిగా నిద్ర పడుతుంది.

అంతేకాకుండా శరీరంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు ఆముదంలో కొబ్బరి నూనె కలిపి కాళ్లకు రాసుకుంటే అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. అంతేకాకుండా పాదాలను మృదువుగా చేస్తాయి. పులిపిర్లు సమస్యతో బాధపడుతున్న వారిని పులిపిరి ఉన్నచోట తరచు ఆముదం రాస్తూ ఉంటే అవి రాలిపోతాయి.ఆముదం వాత పిత్త కఫ దోషాలను తొలగిస్తుంది. ఒక గ్లాసు పాలలో ఒక చెంచా ఆముదం కలిపి రాత్రిపూట తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.

Incredible Health Benefits Of Castor Oil
Incredible Health Benefits Of Castor Oil

మలబద్ధకం నివారిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకోకూడదు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఆముదం రాసి మర్దనా చేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఆముదంలో తాలింపు వేసిన చామదుంపల కూర తింటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆముదం బోదకాలు సమస్యకు చెక్ పెడుతుంది. ఆముదం తీసుకోవడం వల్ల డయాబెటీస్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.