Lakshmi Devi : అక్షయతృతీయ రోజు ఇలా చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంటే..!

Lakshmi Devi : అక్షయ తృతీయ.. హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మాలలో అక్షయ తృతీయ రోజు అత్యంత ప్రాముఖ్యమైన రోజున పరిగణిస్తారు. వైశాఖమాసం శుక్లపక్షం మూడవ రోజున ఈ అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఇక ఈ రోజున అనేక శుభకార్యాలను కూడా చేయవచ్చు. అలాగే ఈసారి అక్షయ తృతీయ 2022 మే 3వ తేదీన రానుంది కాబట్టి లక్ష్మీదేవి కి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అంతే కాదు ఎంతలా అంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎప్పటికి నిలిచి ఉంటుందని.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ప్రజల ప్రగాఢ నమ్మకం.. బంగారంతో పాటు మరే వస్తువు కొనడానికి అయినా సరే అక్షయ తృతీయ రోజు చాలా మంచిదని చెబుతుంటారు.

అయితే దీని వెనుక ఉన్న ఆచరణ ఏమిటి.. ఎందుకు ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు అనే విషయాలను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి అక్షయ తృతీయ గురించి తెలియాలి అంటే ఈ ఆర్టికల్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.ఈ సంవత్సరం 2022 మే 3 వ తేదీన అక్షయ తృతీయ రాబోతోంది. కాబట్టి రోహిణి నక్షత్రంలో మధ్యాహ్నం 12:34 గంటలకు ప్రారంభం అయి.. మే 4వ తేదీన 3:18 గంటలకు అక్షయ తృతీయ ముగుస్తుంది. ఇక ఈ రోజున వివాహం తో పాటు బంగారు ఆభరణాలు , వాహనాలు, వస్త్రాలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఆరోజున దానం చేయడం వల్ల ఆ ఇంట సిరి సంపదలు పెరుగుతాయి అని సమాచారం.

Lakshmi Devi is your home if you do this on Akshaya Tritiya day
Lakshmi Devi is your home if you do this on Akshaya Tritiya day

విష్ణువు ఆరవ అవతారమైన పరుశురాముడు అక్షయ తృతీయ రోజున జన్మించాడు అని.. ఇక పరశురామ జయంతి కాబట్టి ఆ రోజును అక్షయ తృతీయ గా జరుపుకుంటారు మన పెద్దవాళ్ళు. అంతేకాదు ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉండడం గమనార్హం.ఇకపోతే భగీరథుని కఠోరమైన తపస్సు వల్లే గంగా మాత భూమి పైకి వచ్చింది అని అలాగే అన్నపూర్ణ దేవి కూడా ఆరోజు జన్మించిందని నమ్ముతారు. అందుకే ఆ రోజును గంగాదేవి తో పాటు ఆహారధాన్యాలను ,పూజగదిని కూడా ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది. చతుర్థి రోజున శంకరుడు కుబేరుడిని లక్ష్మిని పూజించమని కోరుతాడు కాబట్టి ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని.. ఆ ఇంట సిరి సంపదలతో సుఖ శాంతులతో తులతూగుతారు అని ప్రతీతి.