Health Benefits : ఈ చెట్టుమనుషులకి అమృత కలశం..!

Health Benefits : మన పూర్వీకుల కాలం నుంచే ఆముదమును వాడుతున్నారు. ఆముదం చెట్టు ఆకులు, బెరడు, వేళ్ళు, పువ్వులలో ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇవి జుట్టును నుంచి పాదాల వరకు ఆరోగ్యాన్ని అంధిస్తుంది.. అందుకే ఈ చెట్టును మానవుల పాలిట కల్పవృక్షంగా అభివర్ణిస్తారు ఆయుర్వేద నిపుణులు.. ఈ చెట్టు గురించి మనం తెలుసుకోకపోతే మనమే నష్ట పోతామని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆముదం చెట్టు ఆకులు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆముదం ఆకులకు కొద్దిగా నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. ఈ ఆకులను నొప్పులు ఉన్నచోట ఉంచి కట్టుకడితే కీళ్ల నొప్పుల, కాళ్లు నొప్పులు, నడుం నొప్పులు తగ్గుతాయి. అన్ని రకాల నొప్పులు నుంచి ఉపశమనం అందిస్తుంది. మొలల సమస్యతో బాధపడుతున్న వారు ఆముదం ఆకు లలో కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని మలద్వారం దగ్గర రాస్తే మొలలు తగ్గుతాయి. ఆముదం ఆకులలో చిన్న వుల్లి పాయలు వేసి ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని రెండు రోజులు తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.

Excellent Health Benefits Of Caster Leaves
Excellent Health Benefits Of Caster Leaves

ఆముదం ఆకులను వేడి చేసి ఆకులను పొట్టపై ఉంచితే రెండు సమయం లో వచ్చిన కడుపునొప్పిని తగ్గిస్తుంది.బాలింతలకు పాలు లేకపోతే వారి స్తానాలకు ఆముదం రాసి ఆముదం ఆకులను వేడి చేసి స్తానాలపై ఉంచితే వారికి పాలు పడతాయి. లేత ఆముదం, ఉమ్మెత్త, జిల్లేడు, పొగాకు ఆకులను ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బఠాణీ గింజ పరిమాణంలో చిన్న చిన్న ఉండలుగా చేసి ఎండబెట్టుకుని మాత్రలుగా తయారు చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి ఒక మాత్రను వేసుకుంటే సుఖమైన నిద్ర పడుతుంది.