Hair Tips : ఈ క్రీమ్ రాస్తే చాలు జుట్టు వద్దన్నా పెరుగుతుంది.!!

సాధారణంగా మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు జుట్టుపెరుగుదలకు అందుబాటులో ఉన్నాయి కానీ వీటివల్ల రిజల్ట్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా అంతే రేంజ్ లో ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇది కొద్దిగా ఆలస్యం అయినా పర్లేదు సహజంగా జుట్టు పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న క్రీమ్ మీరు తయారు చేసుకొని జుట్టుకు అప్లై చేసినట్లయితే కచ్చితంగా మీరు వద్దని అనుకున్నా సరే జుట్టు పెరుగుతూనే ఉంటుంది. అయితే జుట్టు పెరుగుదల కోసం ఎలాంటి చిట్కా పాటించాలి ఎలాంటి పదార్థాలను ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు ప్రతి ఒక అమ్మాయికి ఉపయోగపడే ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

క్రీమ్ తయారీ కోసం ముందుగా ఒక కప్పు అవిసె గింజలు తీసుకొని దానికి నాలుగు కప్పులు నీటిని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా చేయడం వల్ల జెల్ తయారవుతుంది. కాస్త పలుచుగా ఉండగానే… స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిని వేడిగా ఉండగానే పలచటి బట్ట సాయంతో వడకట్టుకోవాలి. మరీ గట్టి పడితే.. వడకట్టు కోవడం చాలా కష్టం అవుతుంది. ఇలా వడకట్టిన నీరు కొద్దిసేపు అవగానే జెల్ రూపంలోకి మారుతుంది
ఇక ఇలా చల్లారిన తర్వాత ఈ జెల్ ను తలకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు మృదువుగా, పొడవుగా, నల్లగా, బలంగా, ఒత్తుగా తయారవుతుంది.

This cream is enough to grow on the hair
This cream is enough to grow on the hair

అంతే కాకుండా పలు రకాల జుట్టు సమస్యలను కూడా తరిమి కొడుతుంది. అవిసె గింజల జెల్ అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారు అవుతాయి. అంతే కాకుండా జుట్టు చాలా త్వరగా వద్దన్నా విపరీతమైన పొడవుగా పెరుగుతుంది.అవిసె గింజల్లో విటామిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడి చుండ్రు సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇకపోతే ఒకసారి తయారుచేసి పెట్టుకున్న ఈ జెల్ ను సుమారుగా ఫ్రిజ్లో ఉంచుకొని 15 రోజుల పాటు ఉపయోగించవచ్చు. కనీసం వారంలో నాలుగు రోజులు ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.