Jobs : రక్షణ దళాలలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..?

Jobs : నిరుద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ పలు పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను విడుదల చేస్తూ ఉంది. ఈరోజున తాజాగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బిఎస్ఎఫ్ లో డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో గ్రూప్ డి నాన్ గెజిటెడ్, ఆ మినిస్టర్ రియల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏ విభాగాలలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో వాటిని ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1). మొత్తం పోస్టుల సంఖ్య : 90 ఈ 90 పోస్టులలో.. ఇన్స్పెక్టర్ (ఆర్కిటెక్)-1, సబ్ ఇన్స్పెక్టర్ -57, జూనియర్ ఇంజనీర్/సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రిక్-32 పోస్ట్లు కలవు.

2). అర్హతలు : ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు.. డిగ్రీ ఆర్కిటెక్చర్ , సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

 Jobs in the Defense Forces How to apply
Jobs in the Defense Forces How to apply

3). దరఖాస్తు ఎలా అప్లై చేయాలంటే : ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం ఆన్లైన్లో మాత్రమే వీటిని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

4). ఎంపిక విధానం : అభ్యర్థులను కేవలం శారీరక ప్రమాణాలు, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందట.

5). జీతభత్యాలు:  హిందీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 నుంచి రూ.1,12,400 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు.

6). ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైటు https://rectt.bsf.gov.in/ ను సంప్రదించండి. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14-05-2022 గా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. నిరుద్యోగ సమస్యతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు కేవలం ఉద్యోగులకు మాత్రమే ఆ బాధ అర్థం అవుతుంది. ఇలా ఎంతో మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఆర్టికల్ను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.