Health Benefits : మల్టీ విటమిన్ టాబ్లెట్ కు బదులు ఒక్కసారి ఇది ట్రై చేయండి..!

Health Benefits : మల్టీ విటమిన్ మొక్క గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు.. ఈ మొక్క ఆకులు చూడటానికి కరివేపాకు చెట్టు ఆకులులా ఉంటయి.. కాకపోతే ఈ చెట్టు ఆకులు కాస్త ఎక్కువగా పొడువుగా ఉంటాయి ఉంటాయి.. వంటి విటమిన్ ఆకులనే చక్రముని, స్వీట్ లీఫ్ అని కూడా పిలుస్తారు.. ఈ చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..!

మల్టీ విటమిన్ ఆకుల లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు ఆకుల లో విటమిన్ ఎ, బి , సి, ఉన్నాయి. ఇంకా ఫ్లేవనాయిడ్స్ కెరటోనాయిడ్స్, ప్రొటీన్లు మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆకుల్లో ఉండే రకరకాల ఫ్లేవనాయిడ్స్ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ చెట్టు ఆకులతో కూర వండుకుని తినవచ్చు. రకరకాల కారం పొడి ‌కూడా చేసుకోవచ్చు.

health benefits of Multi Vitamin
health benefits of Multi Vitamin

ఈ చెట్టు ఆకుల ను ఏ విధంగా తీసుకున్నా సరే ఒత్తిడిని తగ్గిస్తాయి. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలసట, డిప్రెషన్, ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఈ చెట్టు ఆకులను రకరకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆకుల పొడి తీసుకుంటే బాలింతలకు పాలు పడతాయి. కాలేయం, ఊపిరితిత్తులు, తలనొప్పి, ఉదర, మూత్రపిండాల సమస్యలు తగ్గిస్తాయి. ఈ చెట్టు వేర్లు తల తిరగకుండా ఉండేందుకు ఉపయోగిస్తారు.