Beauty Tips : రాత్రి సమయంలో ఈ చిట్కాలు పాటిస్తే అందం మరింత రెట్టింపు అవుతుంది..!!

Beauty Tips : ఎవరైనా సరే అందంగా ఉండడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. నలుగురిలో చాలా అట్రాక్టివ్ గా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. పగటి పూట చేసే ఫేస్ మాస్క్ ల కంటే రాత్రి సమయంలో వేసే ఫేస్ మాస్క్ ల వల్ల ప్రయోజనం రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఇకపోతే మార్కెట్లో మనకు రకరకాల స్లీపింగ్ మాస్కులు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటి ఖరీదు కూడా ఎక్కువగా ఉంది. అందుకే వీటిని బయట కొనడంకంటే ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మీరు పడుకునే దానికి ముందు కచ్చితంగా ఏదైనా రాయాలి. ఇది చర్మాన్ని ఉపశమనం చేయడానికి.. అందంగా మార్చడానికి అలాగే ముఖంలో మంచి చైతన్యం నింపడానికి సహాయపడుతుంది.

ఇక రాత్రి సమయంలో పడుకునేటప్పుడు డ్రైవ్ క్యూటికల్స్ చేయడం వల్ల ముఖంలో చైతన్యం వస్తుంది. రాత్రిపూట పడుకునే ముందు పెట్రోలియం జెల్ ముఖానికి ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. రాత్రి పడుకునే ముందు బ్రష్ తో పెదవులను శుభ్రం చేయడం వల్ల పెదవులపై ఉన్న స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఇక తర్వాత పెదవులకు లిప్ బామ్ రాయటం మర్చిపోవద్దు. ఇక అలాగే నిద్రించే ముందు జుట్టుకి కచ్చితంగా ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కచ్చితంగా అప్లై చేయాలి. జుట్టు చివర్ల లో ఎక్కువగా నూనె అప్లై చేయడం వల్ల కొనలు విరిగిపోకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి.

Following these tips at night will double the Beauty Tips
Following these tips at night will double the Beauty Tips

అప్పుడు ఖచ్చితంగా ముఖం మీద ఉన్న మేకప్ పూర్తిగా తీసేసి.. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకొని.. తేలికపాటి క్రీమ్ రాసి నిద్ర పోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక చేతులు, కాళ్లను కూడా ఎప్పటికప్పుడు శుభ్ర పరచుకుంటూ తగిన మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి . అయితే రాత్రి సమయంలో ఇలా చేయడం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది. ఇక ఈ ఆర్టికల్ ను వాట్స్ అప్ ద్వారా అందరికీ షేర్ చేయండి.