Money Benefits : రూ. 342 చెల్లిస్తే చాలు.. రూ. 4 లక్షల వరకు బెనిఫిట్స్..!!

Money Benefits : దేశీయ దిగ్గజం బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్తగా బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకు గా గుర్తింపు తెచ్చుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం తక్కువ డబ్బుతో బీమా సౌకర్యాన్ని అందించడానికి ముందుకు రావడం గమనార్హం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలు ప్రజలకు ప్రయోజనాన్ని కలిగించనున్నాయి.

ప్రస్తుతం ఈ రెండు పథకాల ద్వారా సుమారుగా నాలుగు లక్షల రూపాయల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు.ఇక 342 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బిఐ ఏమని చెబుతోంది అంటే మీ అవసరానికి అనుగుణంగా బీమా చేసుకోండి .. ఆందోళన లేని జీవితాన్ని గడపండి.. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుల నుంచి ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా ప్రీమియం తీసివేయబడుతుంది. ఇక ఒక వ్యక్తి ఒక సేవింగ్స్ బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే పథకంలో చేరడానికి అర్హులు అవుతారు అని స్పష్టం చేసింది. ఎవరైతే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం లో చేరుతారో అలాంటివారు ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా పూర్తిగా వికలాంగుడైన వారికి రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం లభిస్తుంది.

Rs. 342 is enough to pay Rs. Money Benefits up to Rs 4 lakh
Rs. 342 is enough to pay Rs. Money Benefits up to Rs 4 lakh

ఒకవేళ పాక్షికంగా అంగవైకల్యానికి గురి అయితే లక్ష రూపాయల వరకు కవరేజ్ లభిస్తుంది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా సరే ఈ పాలసీ పొందవచ్చు. కేవలం సంవత్సరానికి పన్నెండు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకంలో మరణించిన వారికి రెండు లక్షలు అందజేస్తారు. అయితే ఈ పాలసీ కేవలం 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు మాత్రమే ఉండాలి. 330 రూపాయలు సంవత్సరానికి చెల్లించాలి. ముఖ్యంగా బ్యాంకు ఖాతా మూసివేయించిన లేదా ప్రీమియం కట్టే సమయంలో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా సరే బీమా రద్దు అవుతుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకొని బీమా తీసుకోవడం తప్పనిసరి.