Health Benefits : మొక్కజొన్నల వల్ల లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

Health Benefits : మొక్కజొన్న కి మధుమేహం సమస్య ని నియంత్రించే శక్తి ఉందని ఇటీవల అమెరికా డయాబెటిస్ అసోసియేషన్ వెల్లడించింది. మొక్కజొన్న ఎక్కువగా అందరికీ అందుబాటులో వుంటుంది కాబట్టి చాలామంది తినడానికి ఇష్టపడతారు. సాధారణ మొక్కజొన్న తో పోల్చుకుంటే స్వీట్ కార్న్ కి ఇటీవల బాగా డిమాండ్ పెరిగింది. ఇకపోతే ప్రస్తుతం కార్న్ తినే వాళ్ళలో రక్తంలో చెడు కొలెస్ట్రాల్, పొట్ట దగ్గర కొవ్వు శాతం తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. సినిమా థియేటర్ల దగ్గర, సాయంత్రం స్నాక్ రూపంలో చాలామంది స్వీట్ కార్న్ ను ఎక్కువగా తీసుకుంటారు.

ఇక ఊదారంగు కార్న్ లో ఉండే సంక్లిష్ట ఫైటో కెమికల్స్ మంటను తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచినట్లు గుర్తించారు. అంతేకాదు ఇందుకోసం అన్ని రంగుల మొక్కజొన్న తీసుకొని వాటిని వర్గాలుగా విభజించి కొంతకాలం పాటు ఎలుకలకు ఆహారంగా ఇవ్వడం జరిగింది.. అన్ని రకాల మొక్కజొన్న లలో కూడా ఆంతో సైనిన్ వల్ల రోగనిరోధక శక్తి పెరిగిందని వారు వెల్లడించారు. క్లోమగ్రంథి పనితీరు మెరుగు పడినట్లు గుర్తించారు. మొక్కజొన్న గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణంగా దీనిని జొన్నలు అని కూడా పిలుస్తుంటారు.

Health Benefits of Mokkajonna
Health Benefits of Mokkajonna

మొక్క జొన్నలను కంకులు గా ఉన్నప్పుడు వాటిని తినవచ్చు లేదా కొద్దిగా మసాలాలు, కారం, ఉప్పు కూడా తగిలించి తినవచ్చు. చాలామంది ఫ్రైడ్ రైస్ కూడా తయారు చేసుకొని తింటుంటారు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటివాటితో కూడా చేర్చి చిరుతిండి గా తినవచ్చు. మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ బీ 1, విటమిన్ బీ 6, విటమిన్ ఇ, నియాసిన్ ఫోలిక్ యాసిడ్ రిబోఫ్లేవిన్ వంటి ఎన్నో విటమిన్లు ఉన్నాయి. వీటిని తినడం వల్ల రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తప్పకుండా మొక్కజొన్న తినడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి.