Health Benefits : గుమ్మడి కాయ గింజలు తింటే ఏమౌతుందో తెలుసా..?

Health Benefits : గుమ్మడికాయను ఎక్కువగా దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు.. కానీ నరదిష్టి ఎలా అయితే పోగొడుతుందో.. ఆరోగ్యాన్ని పాడుచేసే రకరకాల సూక్ష్మక్రిములను, వైరస్ లను, ఇన్ఫెక్షన్లను తరిమికొట్టే శక్తి కూడా గుమ్మడికాయకు ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా గుమ్మడికాయ గింజలలో విటమిన్ ఏ , విటమిన్ కె, విటమిన్ బి తో పాటు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. బీటా కెరటిన్, భాస్వరం, పొటాషియం, ఇనుము , మెగ్నీషియం, రాగి తో పాటు అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి.ఈ గుమ్మడి గింజలలో లభించే రోగనిరోధక శక్తి వల్ల వైరస్ లు, బ్యాక్టీరియాలు కూడా నాశనం అవుతాయి.

ఫలితంగా సీజనల్ గా వచ్చే వ్యాధులు కూడా దూరమవుతాయి. గుమ్మడికాయ గింజలు లో ఉండే పోషకాల వల్ల క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి వీటికి ఉంది. అంతే కాదు అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. గుమ్మడి గింజల్లో విటమిన్ సీ లభించడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా రోగాలను దూరం చేసుకోవచ్చు. విటమిన్ సి కారణంగా చర్మ రోగాలను దూరం చేసుకోవడమే కాకుండా జుట్టు పెరుగుదలను కూడా పెంపొందించుకోవచ్చు.గుమ్మడి గింజల్లో లభించే ఫైబర్ కారణంగా జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేకాదు గుండె సంబంధిత రోగాలను దూరం చేయడంలో కూడా ఫైబర్ చాలా చక్కగా పనిచేస్తుంది.

The Health Benefits pumpkin seeds
The Health Benefits pumpkin seeds

గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో గుమ్మడి గింజల్లో ఉండే ఫైబర్ చాలా చక్కగా పనిచేస్తుంది. శరీరంలో ఉండే అదనపు కొవ్వును తగ్గించి.. హృదయ ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా చక్కగా పనిచేస్తుంది. గుమ్మడి గింజల వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. చిన్న పెద్ద మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా గుమ్మడి గింజలను తమ ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టం కలగదు.. ముఖ్యంగా కండరాల అభివృద్ధికి పాటుపడుతున్న వారు తప్పకుండా తమ ఆహారంలో గుమ్మడి గింజలు చేర్చుకోవచ్చు. అలాగే బరువు తగ్గే వారికి ఒక మంచి ఉపశమనం అని చెప్పవచ్చు.