Kaniha: నడవలేని స్థితిలో రవితేజ హీరోయిన్ కనిహ.. !

Kaniha: హీరోయిన్ కనిహ అంటే వెంటనే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ మాస్ మహారాజా రవితేజ, భూమిక, కనిహ కలిసి నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా కంటే ముందు సత్తిబాబు తెరకెక్కించిన ఒట్టేసి చెబుతున్న సినిమాలో కూడా శ్రీకాంత్ సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో మలయాళం ఇండస్ట్రీలోనే స్థిరపడిపోయింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈమె ఇటీవల గాయపడినట్లు తెలుస్తోంది.

HBD Kaniha: Lesser known facts about the actress | The Times of India

గత కొద్దిరోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న ఈమె ఇప్పుడు ఇప్పుడే అడుగులు వేస్తోంది. వాకర్ పట్టుకొని నడుస్తున్న ఫోటోలు తన ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ బ్యాలెన్స్గా అడుగులు వేయడం నేర్చుకుంటున్నాను అంటూ రాసుకుంది. అయితే ఇది చూసిన ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక కనిహా అందంలో అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.<

 

View this post on Instagram

 

A post shared by Kaniha (@kaniha_official)

/p>