Balakrishna : బాలయ్య స్కెచ్.. అలేఖ్య రెడ్డి ఇన్.. కొడాలి నాని అవుట్..

Balakrishna :  నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆయనే గనక ఉండి ఉంటే ఈసారి ఎలక్షన్లలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. తారకరత్న ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకున్నారో.. ఆయన నిర్ణయాన్ని బ్రతికించేందుకు బాలయ్య ఓ బలమైన నిర్ణయం తీసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు..

 

 

 

తారకరత్న గుడివాడ నుంచి పోటీ చేయాలని అనుకున్నారట. అందుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు బాలకృష్ణ తో కూడా సంప్రదింపులు కూడా జరిగాయని అధిష్టానం కూడా ఓకే అన్నారని.. ఆయన ఎలక్షన్లలో పోటీ చేయడమే అందరికీ కావాలని కోరుకున్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో తారకరత్న బలైపోయాడు. భారతరత్న లేకపోయినా ఆయన ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ఆయన భార్య అలేఖ్య రెడ్డిని రంగంలోకి దింపుతున్నారు. నందమూరి బాలకృష్ణ గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యేగా కొడాలి నాని ఉన్న సంగతి తెలిసిందే. కాకపోతే ఆయన మాటలే మాటలు వైఖరి వలన ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత ఏర్పడింది. ఇక ఇటీవల ఆయన అరెస్టు అయిన సంగతి కూడా మనకు తెలిసిందే.

ఇప్పుడు అదే నియోజకవర్గ నుంచి అలేఖ్య రెడ్డిని పోటీ చేయించాలని బాలకృష్ణ అనుకుంటున్నారట. అంతేకాకుండా నందమూరి తారకరత్న లేకపోవడంతో ఆయన అనుచరులు కూడా అలేఖ్య రెడ్డి అక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఆవిడకు పూర్తి మద్దతు ఇవ్వడానికి టీడీపీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారట. ఈ ఎలక్షన్లలో అలేఖ్య రెడ్డి పోటీ చేస్తే తారకరత్న సానుభూతి ఓట్లు కూడా పడి ఆమె గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అలేఖ్య రెడ్డి గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయనుందని అది కూడా కొడాలి నాని పై అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అందరూ అదే కోరుకుంటున్నారు. తారకరత్న ఆశయాలను అలేఖ్య రెడ్డి ప్రజల్లోకి తీసుకు వెళ్తుందని అంత ఆశిస్తున్నారు..