Gangula Kamalakar: వరుస గుండెపోటు ఘటనలపై సంచలన నిర్ణయం..!

Gangula Kamalakar.. మహమ్మారి కరోనా బెడద పోయిందని అనుకున్న తర్వాత కూడా మనిషి ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. చాలామంది రకరకాల శారీరక సమస్యలతో బాధపడుతున్నారు ఎక్కువగా విద్యార్థులు గుండెపోటుకు గురై మరణిస్తూ ఉండడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కువగా యువత తెలంగాణ రాష్ట్రంలోనే మరణిస్తూ ఉండడం పలు సంచలనాలకు దారితీస్తోంది.. నిన్న మేడ్చల్ శివారులో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి గుండెపోటుకు గురై మరణించడం బాధాకరం.

Gangula Kamalakar no match to Eatala Rajender

ఇలా విద్యార్థులు వరుసగా గుండెపోటుకు గురై మరణిస్తూ ఉండడంతో మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండే కాలేజీ విద్యార్థులకు నిర్బంధ వైద్య పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదే కాదు యువతకు, విద్యార్థులకు ఈసీజీ, బ్లడ్ టెస్ట్ లాంటి పరీక్షలు నిర్వహిస్తామని ఇందుకు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ యాజమాన్యాలు సహకరించాలని కూడా ఆయన సూచించారు. అదేవిధంగా సీపీఆర్ పై పోలీస్ మున్సిపల్ సిబ్బందికి అవగాహన కల్పిస్తామని మంత్రి గంగుల పేర్కొన్నారు.