Manchu Manoj.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో మంచు మనోజ్ రెండవసారి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు.. కర్నూలుకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనిక రెడ్డి తో ఆయన వివాహం నిన్న రాత్రి 8:30 గంటలకు మంచు మనోజ్ అక్క మంచు లక్ష్మి ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహానికి మంచు మోహన్ బాబు ,మంచు లక్ష్మి , మంచు విష్ణు తో పాటు ఇరుకుటుంబ సభ్యులు , పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇకపోతే మంచు లక్ష్మి తన తమ్ముడి వివాహ వేడుకను భుజాన వేసుకొని మరీ నిర్వహించింది. తమ్ముడిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేయడం నుంచి పెళ్లి పనులన్నీ కూడా ఆమె దగ్గరుండి చూసుకుంది. ఒక మాటలో చెప్పాలంటే పెళ్లి పెద్దగా మారి తమ్ముడు వివాహ తంతును తానే స్వయంగా పూర్తి చేసింది మంచు లక్ష్మి. ఈ విషయం తెలిసి పలువురు ప్రశంసలు కురిపిస్తుంటే మనోజ్ కూడా తన అక్క గురించి ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. తనను పెళ్ళికొడుకుని చేస్తున్న మంచు లక్ష్మి ఫోటోను తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ..” అక్క ఏ జన్మ పుణ్యమో నాది.. లవ్ యు అక్క.. థాంక్స్ ఫర్ ఎవరీ థింగ్” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.