PF withdrawal.. ప్రస్తుత కాలంలో చాలామంది ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా కొత్త ఇంటి నిర్మాణం, విదేశాల చదువు నిమిత్తం డబ్బు కోసం ఎన్నో అవస్థలు పడాల్సి ఉంటుంది.. అలాంటి సమయంలో ఉద్యోగులు వారి పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది కానీ పిఎఫ్ కు సంబంధించిన నిబంధనలు తెలియక కొంతమంది సిబ్బంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రతినెలా మీ జీతం నుంచి పిఎఫ్ కట్ అవుతూ ఉంటుంది. భవిష్యత్తు భద్రత కోసం చేసే ఈ పొదుపు కష్ట సమయాలలో ఆసరాగా ఉంటుంది.
ఎప్పుడు ఈ పిఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. హోమ్ లోన్ రీపేమెంట్ కోసం ఈపీఎఫ్ ఖాతా పది సంవత్సరాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే గృహోపరణాల చెల్లింపు కోసం పిఎఫ్ బ్యాలెన్స్ లో 90 శాతం వరకు మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. అదే పిల్లల ఉన్నత విద్య కోసం ఉద్యోగి 7 సంవత్సరాల పూర్తయితే అందులో నుంచి 50 శాతం వరకు విత్డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. పిల్లల వివాహం, ఉద్యోగి వివాహం లేదా , పిల్లల, సోదరి వివాహం కోసం 50 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.