Taraka Ratna: నందమూరి తారకరత్న యువగళం పాదయాత్రలో సోమసిల్లీ పడిపోవడం, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం.. ఆయనను బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పటల్ కి తీసుకు వెళ్ళడం జరిగింది.. కాగా ప్రస్తుతం ఆయన పరిస్థితి కుదుటపడుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.. ఇప్పటికే నారా, నందమూరి కుటుంబంతో పాటు బెంగుళూరులోని ఆసుపత్రిలో పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ , టీటీడీ బోర్డు మాజీ సభ్యులు చల్లా రామచంద్ర రెడ్డి కూడా ఉండడం గమనార్హం.
చల్లా రామచంద్ర రెడ్డికి తారకరత్నతో పార్టీ పరమైన సంబంధమే కాదు. బంధుత్వం కూడా ఉంది. తారకరత్న పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి మరెవరో కాదు.. చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కూతురే అలేఖ్య రెడ్డి కావడం గమనార్హం. దాంతో తారకరత్నకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి చల్లా కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది.
భర్తకు గుండె గాయపోటు రావడం, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుమిలిపోతున్న తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చుతూ ధైర్యం చెబుతూ చాలా భార్య సుప్రియ రెడ్డి కూడా బెంగళూరులోని ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ కష్ట సమయంలో తన పుట్టింటి తరఫున అలేఖ్య రెడ్డికి తోడుగా ఉంటూ ధైర్యం చెబుతున్నారు. ఆమెతోపాటు తారకరత్న పై బెంగ వేసుకుని బాధపడుతున్న పిల్లలకు మనోధైర్యాన్ని అందిస్తున్నారు.
తారకరత్న తండ్రి మోహన కృష్ణ కూడా బాలకృష్ణ, చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చల్లా రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు. అంతా మంచే జరుగుతుందని అభిమానుల ప్రార్ధనలతో తారకరత్న తప్పకుండా పాల్గొంటారని వారి కుటుంబానికి ధైర్యం చెబుతూ నందమూరి కుటుంబం అండగా నిలబడడం హర్షించదగిన పరిణామం. ఈరోజు నందమూరి తారకరత్న ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తరువాత ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.