Hair : మీ ఇంటి హాల్ లో కూర్చుని జుట్టు దువ్వకండి .. వచ్చే డబ్బు మొత్తం పోతుంది !

Hair: చాలామంది ఇల్లు వాస్తు శాస్త్రం నియమాల ప్రకారం కట్టించుకుంటారు. అయితే ఇంట్లో వాస్తు నియమాలకు విరుద్ధంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. జీవితాలపై ప్రతికూలమైన ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. ఇంట్లో చేయకూడదని చెప్పినా అవి లెక్క పెట్టకుండా కొంతమంది చేస్తూ ఉంటారు.. గోర్లు కొరకడం, ఇంటి మధ్యలో కూర్చొని జుట్టు దువ్వుకోవడం వంటి అనేక పనులు నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి.‌. ముఖ్యంగా మహిళలు జుట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఇంటిలో జేష్టాదేవి తాండవిస్తుంది..

dont hair comb middle of the house because
dont hair comb middle of the house because

స్త్రీలు జుట్టు విరబుసుకొని ఇంట్లో ఎప్పుడూ పని చేయకూడదు. జుట్టు విరబోసుకొని మహిళలు నిద్రపోకూడదు . అంతేకాదు మహిళలు నటింట్లో జుట్టు దువ్వకూడదు . వెంట్రుకలు ఇంట్లో పడటం మన పెద్దవాళ్లు ఆ శుభమని చెబుతూ ఉంటారు. అందుకే జుట్టు దువ్వుకునేటప్పుడు మహిళలు ఆరు బయట గాని, వరండాలో కానీ, ఇంటికి దూరంగా కానీ దువ్వుకోవాలి. వెంట్రుకలు నట్టింట్లో పడితే శనిదేవునిని ఆహ్వానించినట్లేనని. అది ఇంట్లో ప్రతికూల వాతావరణ సృష్టిస్తుందని చెబుతారు.

జుట్టు విరబోసుకొని మహిళలు ఎదురు వచ్చినా కూడా ఆ పనులు జరగవు అని ప్రతికూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. మంగళవారం నాడు మహిళలు జుట్టు అస్సలు కత్తిరించకూడదు. ఆరోజు జుట్టు కత్తిరించుకోవడం జుట్టు విరబోసుకొని తిరగడం అరిష్టం అని పెద్దలు చెబుతున్నారు. స్త్రీలు మంగళవారం అసలు జుట్టుని ఎక్కువగా దువ్వకూడదని.. మంగళవారం ఇంట్లో జుట్టు రాలితే ఆ ఇంటికి దరిద్రం పడుతుదని చెబుతున్నారు. నట్టింట్లో కూర్చుని తల దువ్వడం, నటింట్లో కూర్చొని పేలు దువ్వడం వంటివి ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తాయని పెద్దలు చెబుతున్నారు.

పొరపాటున కూడా ఇంట్లో వెంట్రుకలు పడకూడదని. అలా పడితే మనం తినే ఆహార పదార్థాలపై అవి పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజలు చేయకూడదని.. అలా చేసిన పూజలు ఆమోదయోగ్యం కావనీ చెబుతున్నారు. సాయం సంధ్యా వేళలో, ఆ తర్వాత జుట్టు దువ్వ కూడదు.