Samantha: ఎవ్వరికీ చెప్పకుండా ముంబైలో సమంత పిచ్చి పని.. అక్కినేని ఫ్యామిలీకి గుండెల్లో రాయి.!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ముంబైలో సొంత ఇల్లు కొనుక్కున్నారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అది నిజమే అని తెలుస్తోంది.. ఇప్పుడు అందరూ ఆ ముంబై ఇంటి గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం కూడా ఉంది. అదే సమంత ఇటీవల షేర్ చేసిన సూర్యాస్తమయం ఫోటోలు.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు విషయం బయట కొచ్చింది..

Samantha ready to buy new falt in Mumbai
Samantha ready to buy new falt in Mumbai

సమంత తాను ఉంటున్న ప్రదేశం నుండి సూర్యాస్తమయం సమయాన్ని ఓ ఆహ్లాదకరమైన ఫోటోని షేర్ చేసింది. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. అది ముంబైలోని స్కై స్క్రాపర్ బాల్కనీ నుండి అందమైన ఫోటోలను షేర్ చేసిందని క్లారిటీ గా తెలుస్తోంది. ఆ ఫోటో ఏదైనా 5 స్టార్ హోటల్ లో దిగింది అనుకుంటే పొరపాటు. అది భారీ భవంతుల సముదాయం. బాలీవుడ్ రాజధానిలోని తన నివాస ప్రాంతం నుండి సమంతా ఈ ఫోటోని షేర్ చేసి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

సీ వ్యూయింగ్ తో ఉన్న త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ని సమంత కొనుక్కుందని అంతా భావిస్తున్నారు. ముంబైలో రామ్ చరణ్ , అల్లు అర్జున్ తో సహా పలువురు స్టార్ హీరోలు సొంత అపార్ట్ మెంట్స్ కొనుక్కున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో సమంత కూడా చేరింది..

సమంత తను ముంబైలో ఇల్లు కొంటున్న సంగతి ఎవరితో చెప్పటం లేదట. ముఖ్యంగా ఈ విషయం అక్కినేని ఫ్యామిలీకి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుందని సమాచారం. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీకి ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కూడా లేదని సమాచారం. అంతేకాదు ఆ దరిదాపుల్లో కూడా అక్కినేని ఫ్యామిలీకి అపార్ట్మెంట్స్ లేవట సమంత ఇదంతా కావాలని సీక్రెట్ గా ప్లాన్ చేసిందట.

సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకేతో సిటాడెల్ సిరీస్ కోసం ముంబై లో షూటింగ్ లో పాల్గొనుంది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లపైనా పూర్తిగా దృష్టి సారిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో సమంత సెకండ్ షెడ్యూల్లో పాల్గొనుంది. ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అందుకే తను వరుస సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారట.