Malika: బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ హాట్ బ్యూటీ మలైకా అరోరా తో డేటింగ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరి రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వారిద్దరి రిలేషన్షిప్ గురించి అర్జున్ కపూర్ పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాతో పంచుకున్నారు. మలైకా అరోరా పై అర్జున్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అర్జున్ కపూర్ కంటే మలైకా అరోరా వయసులో ఎంత పెద్దదో అందరికీ తెలుసు. అయినా కానీ ఈ జంట మా ప్రేమకు వయసు, మతం, కులం అడ్డురాదంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ రీసెంట్ గా నటించిన చిత్రం కుత్తే ..ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అర్జున్ డేటింగ్ లైఫ్ గురించి ప్రేమ గురించి స్పందించాడు.
మలైకా గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం ఒకరికి ఒకరం బాగా సెట్ అయ్యాము. మా మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. మేము మా రోజువారి పనులను పంచుకుంటాం. అంతేకాకుండా ఒకరినొకరం అర్థం చేసుకుంటాం. కానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి ఈగో లేదు. మంచి రిలేషన్షిప్ ఉంది ..
మేము మా బంధాన్ని రోజురోజుకీ ఇంకా స్ట్రాంగ్ గా చేసుకుంటున్నాము. నేను మలైకాతో ఉంటే హ్యాపీగా ఉన్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. నేను సంతోషంగా పడుకోవడం అంతే హ్యాపీగా నిద్ర లేవడానికి కారణం మలైకా అంటూ అర్జున్ కపూర్ చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం అర్జున్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ మాటలపై నేటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.