Balakrishna : బాలకృష్ణ గొప్పతనం అద్ది రా .. అప్పుడు హీరోయిన్ గా ఇప్పుడు తల్లిగా చేసే ఒకే ఒక్క నటి !

Balakrishna :సుహాసిని తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తన అందం అభినయంతో సినిమాల్లో నటించి మెప్పించింది.. టాలీవుడ్ టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాలలో నటించింది.. అయితే సుహాసిని హీరోయిన్ గా నటించిన ఓ స్టార్ హీరోతో అదే స్టార్ హీరోకి తల్లి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Balakrishna acting Suhasini with heroine and mother character
Balakrishna acting Suhasini with heroine and mother character

సుహాసిని హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఆమెకు దర్శక దిగ్గజం మణిరత్నంతో ఆమెకు వివాహం జరిగింది. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉండకపోయినా.. ఎక్స్పోజింగ్ దూరంగా ఉంటూ చీర కట్టలు తెలుగు సాంప్రదాయమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సుహాసిని చాలా సెలెక్టివ్ గా రోల్స్ ను ఎంచుకుంటుంది. డైరెక్టర్ చెప్పిన అన్ని పాత్రలను విన్నా కూడా మంచి పాత్ర అయితేనే సుహాసిని నటిస్తోంది. ఇటీవల ఓ వెబ్ సిరీస్ లో సుహాసిని ఏకంగా పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.

 

సుహాసిని బాలకృష్ణ తో ఎన్నో హిట్ చిత్రాలలో నటించింది. మంగమ్మగారి మనవడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, బాలగోపాలుడు వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. అయితే సుహాసిని బాలకృష్ణ సరసన హీరోయిన్ గానే కాకుండా తల్లిగా కూడా నటించింది. దర్శకత్వంలో 2014లో బాలకృష్ణ లెజెండ్ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ తల్లి పాత్రలో సుహాసిని కనిపించారు. ఇలా సుహాసిని బాలకృష్ణ సరసన హీరోయిన్ గా తల్లిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 

సాధారణంగా తన పక్కనే హీరోయిన్ గా చేసిన వారిని మళ్ళీ వారి సినిమాలలో హీరోయిన్ గానే తీసుకుంటారు. లేదంటే వాళ్లతో నటించడానికి కొంతమంది ఒప్పుకోరు. ఎందుకంటే స్టార్ హీరోలు కాబట్టి వారిపై ట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది.. పైగా రకరకాల కామెంట్స్ వస్తుంటాయి.. కానీ బాలకృష్ణ తనతో హీరోయిన్ గా నటించిన సుహాసిని మళ్ళీ తన తల్లిగా నటించే క్యారెక్టర్ లో యాక్ట్ చేయడానికి కూడా ఒప్పుకున్నారంటే.. బాలయ్యది ఎంత పెద్ద గొప్ప మనసు అర్థం చేసుకోవచ్చు..