Balakrishna: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లెలో రెండు రోజుల నుంచి చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు సందడి చేస్తున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మాటలకు బలాన్ని ఇచ్చింది బాలయ్య అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీడియాతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని.. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏ వ్యూహం ప్రకారం.. ఆ ప్రకటన చేశారు అనే ఆలోచనలు తెలుగు తమ్ములు మదిలో మెదులుతున్నయి.
ఒకవైపు జనసేనతో పొత్తు కాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికలకు ఏడాది సమయమే ఉంది ఇలాంటి సమయంలో 175 నియోజకవర్గాల్లో గెలుచుకోవాలని అనడం అందరిని ఆలోచింపజేస్తున్నాయి చంద్రబాబు మాటలు. ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న వై నాట్ 175 కౌంటర్ ఇవ్వడానికి ఈ వ్యాఖ్య చేశారా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీని వెనుక ఉన్నది మాత్రం బాలయ్య బాబట..
వచ్చే ఎలక్షన్లలో టిడిపి గెలవడానికి బాలకృష్ణ బాబు పొలిటికల్ స్ట్రాటజిస్తులతో పక్కా ప్లాన్ వేశారని.. ముందుగానే వారితో వ్యూహ రచించి బాబుతో 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరతామని చెప్పించారట.. బాలయ్య ఇప్పటివరకు పలు సర్వరీ చేపించారని అన్ని కూడా టిడిపికి ఫేవర్ గానే ఉన్నాయని వచ్చే ఎలక్షన్స్ లో గెలవడం ఖాయమని బాలకృష్ణ చంద్రబాబు కి చెప్పడంతో ఆ ధైర్యంతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేశారని .. ఈసారి ఎలక్షన్స్ లో గెలవడానికి బాలయ్య ముందుకంటే రెట్టింపు ఉత్సాహంతో పక్కా వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం.