Theatre: ఈసారి సంక్రాంతి బరిలో ముందుగా నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.. ఒకరోజు వ్యవధితో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా రంగంలోకి దిగారు.. పోటాపోటీగా ఈ సినిమా కలెక్షన్స్ వసూల్ అవుతున్నాయి.. ఇక ఈ సినిమా ధియేటర్ల యజమానులకు కాసుల వర్షమే కురిసిందని చెప్పాలి.. ఈ సంక్రాంతికి వచ్చిన డబ్బులను కాపాడుకోవడం కూడా తెలియాలంటారు పెద్దలు. కానీ ఈ థియేటర్ యజమాని కి అదృష్టం కలిసి వచ్చిన శనిదేవడు నెత్తిమీద డాన్స్ వేసినంత పనైంది..

Collections in Lakshmi theatre in ponnur is chory
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శ్రీ లక్ష్మీ థియేటర్ లో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బ్యాక్ టు బ్యాక్ షో లు నడిచాయి ఈ మూడు రోజులు కలెక్షన్లు దండిగా నే వచ్చాయి ఇక మూడు రోజులు సెలవులు కావడంతో బ్యాంకులో డబ్బులు వేయకుండా వచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా టికెట్ కౌంటర్ లోనే ఉంచేసుకున్నారు మేనేజర్..
ఈ విషయం గమనించిన దుండగులు ఆ థియేటర్లో చోరీకి పాల్పడ్డారు.. మూడు రోజుల నుంచి వీరయ్య వీర సింహారెడ్డి సినిమాల నుంచి వచ్చినా కలెక్షన్స్ ను థియేటర్లోని లాకర్ లో ఉంచారు మేనేజర్.. ఇప్పుడు ఆ దొంగలు ఆ డబ్బును దొంగ లేచారు వెంటనే అప్రమత్తమైనా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు..