Trisha: సౌత్ స్టార్ హీరోయిన్స్ లో త్రిష కూడా ఒకరు.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.. ఇక కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. త్రిష పోనియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ తన కెరీర్ ను మొదలుపెట్టింది.. త్రిష నటించిన కోలీవుడ్ సినిమా రాంగి ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టంగ్ స్లిప్ అయింది..
త్రిష ను యాంకర్ ప్రశ్నిస్తూ.. మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటి అని అడుగగా.. త్రిష సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం అంటూనే.. బ్రాహ్మణుల ఇంటి భోజనాన్ని బాగా ఇష్టపడతాను అంటూ కన్ఫ్యూజన్ గా సమాధానం ఇచ్చింది. దాంతో త్రిష మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అడిగిన ప్రశ్నకి సూటిగా ఆన్సర్ ఇస్తే సరిపోతుంది ..మధ్యలో బ్రాహ్మణ కులం పేరు తీసుకురావడం అవసరం లేదు కదా మేడమ్ అంటూ కొందరు ఆమెని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోయిన్ త్రిష కి కక్యాస్ట్ పిచ్చి ఉందని.. ఆ కారణంగానే ఇలా అడగకపోయినా తన మనసులోని మాటను బయటపెట్టి.. ఈ విధంగా అడ్డంగా బుక్ అయింది అంటూ కోలీవుడ్ జనాలు ఆమెపై ఫైర్ అవుతున్నారు.