Husband: మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. అప్పటివరకు మనతో సంతోషంగా ఉన్నవారు.. మరు నిమిషం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు.. అప్పటివరకు తనతో కబుర్లు చెప్పిన భర్త బాత్రూంలోకి వెళ్లి విగత జీవిగా మారిపోయాడు.. ఇప్పుడు అలాంటి ఘటనే చత్తీస్గడ్ దుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది..
భర్త వినోద్ శర్మ రాత్రి తన భార్య నేహా శర్మతో కలిసి టీవీ చూస్తున్నాడు. ఇద్దరూ టీవీ చూస్తూ కబుర్లు కూడా సంతోషంగా చెప్పుకున్నారు. టీవీ చూస్తున్న వినోద్ బాత్రూంకి వెళ్ళాడు. బాత్రూంకి వెళ్లిన భర్త ఎంతసేపటికి రాకపోవడంతో.. ఆ భార్యకి అనుమానం వచ్చింది. బాత్రూం డోర్ దగ్గరికి వెళ్లి.. భర్తని పిలిచింది. తను ఎంతసేపటికి రాకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి చూస్తే వినోద్ బాత్ రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటివరకు తనతో సంతోషంగా ఉన్న వినోద్ ఒక్కసారిగా ఇలాంటి చర్యకు పాల్పడేసరికి నేహా షాక్ కు గురైంది. ఇరుగుపొరుగువారు వినో హాస్పిటల్కి తీసుకువెళ్లగా అప్పటికే వినోద్ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. వినోద్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.