Suneetha: సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. మూడు వేలకు పైగా పాటలు పడిన సునీత స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంది.. సునీత తరచూ ఇన్స్టాగ్రామ్ లో తన వీడియోస్ తో సందడి చేస్తుంది. తాజాగా సునీత పచ్చచీర కట్టుకుని పసుపు జాకెట్ వేసుకుని మెడలో ముత్యాల దండలో వేసుకుని సునీత ఓ పాట పాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు నీ పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో ..ఓ..లాలలాల…. ఓ..లాలలాల..
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో.. ఈ పాట అంతం సినిమాలోది. నాగార్జున నటించిన ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలోని పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన పాటను ఇప్పుడు సింగర్స్ సునీత ఆలపించింది. సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ పాట సునీత తన భర్త రామ్ కోసమే పాడిందని నెటిజన్స్ అంటున్నారు. గ్రీన్ చీరలో ఇంత అందంగా ఉంది ఏంటి అంటే సునీతని పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సునీత సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.