Singer Sunitha : సునీత హ్యాపీ మూమెంట్స్ లో రామ్ ఏంటి అలా ఉన్నాడు.!?

Singer Sunitha :సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ సునీత ఇప్పటికే మూడు వేలకు పైగా పాటలను పాడారు.. స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఆమె తన అభిమానులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే తన భర్తతో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ ని కూడా వీడియో రూపంలో షేర్ చేయగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

న్యూ ఇయర్ హ్యాపీ మూమెంట్స్ 2023 అంటూ సునీత ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తను బహుశా ఆస్ట్రేలియా లో ఉన్నట్లు తెలుస్తోంది. స్మైల్ ఫొటోస్ ను తన కుటుంబంతో కలిసి ఉన్న మరికొన్ని ఫోటోలను కూడా జత చేసింది. ఇక తన భర్త రామ్ వీరపనేని తో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో రామ్ షార్ట్ లో దర్శనమిచ్చాడు.. రామ్ కి ఐదు పదుల వయసు ఉంటుంది. కానీ ఇప్పటికీ ఏం బాయ్ లాగా టీనేజీ కుర్రాడు లాగా షాట్లో కనిపించేసరికి అందరూ అవాక్కయ్యారు. కానీ సునీత రామ్ కలిసి ఉన్న ఫోటో మాత్రం అందరికీ నచ్చేసింది. క్యూట్ కపుల్ అంటూ మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని సునీత ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు