Samantha : సమంత ని అంత మాట అనేసాడేంటి పరుచూరి.!? దారుణం..! పాపం సామ్..

Samantha : పరుచూరి గోపాలకృష్ణ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. ఈయన తన యూట్యూబ్ ఛానల్ లో తనదైన శైలిలో రిలీజ్ అయిన సినిమాలపై రివ్యూ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత నటించిన పాన్ ఇండియా చిత్రం యశోద సినిమాకి కూడా రివ్యూ ఇవ్వగా.. పరుచూరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

parchuri-gopala-krishna-viral-comments-on-samantha-yashoda-movie
parchuri-gopala-krishna-viral-comments-on-samantha-yashoda-movie

యశోద సినిమాలో సమంత నటనను, యాక్షన్ సీన్స్ ను పరుచూరి గోపాలకృష్ణ ఓ రేంజ్ లో పొగిడారు.. కానీ ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి నటించి ఉంటే సమంత పాత్రలో దుమ్ము దులిపేసి ఉండేదని.. విజయశాంతి సమంత రోల్ లో ఇరగదీసేదని.. కచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ బ్రేకింగ్ రికార్డు అయి ఉండేదని.. సమంత బాడీ లాంగ్వేజ్ అప్పట్లో విజయశాంతికి మాత్రమే ఉండేదని.. ఆమె లేడీ అమితాబ్ అంటూ.. ఇలాంటి రోల్స్ విజయశాంతి అప్పట్లో చేసి ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం గజగజ వణికి పోయే వారిని పరుచూరి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.. అయితే ఈ కామెంట్స్ ని.. కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. కొందరు ఈ సినిమాని నయనతార చేసి ఉంటే బాగుండేదని అన్నారు. ఏది ఏమైనా సరే సమంత యశోద సినిమాలో ఇరగదీసింది అనడంలో సందేహమే లేదు.