Prabhas : ఆ ఇంటికి పెద్ద అల్లుడు గా ప్రభాస్ … ఫ్యాన్స్ కి goosebumps తెప్పించే వీడియో !

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.. ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాతే శర్వానంద్ పెళ్లి చేసుకుంటానని చెప్పడం మరో హైలెట్.. అయితే నేను సల్మాన్ ఖాన్ చేసుకున్న తర్వాత చేసుకుంటాను అని ప్రభాస్ ఫన్నీగా అనడం హైలైట్.. ఇదంతా బాలయ్య అన్ స్టాపబుల్ షో లో జరిగిన తతంగం.. తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో విడుదల అవ్వగా అది నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement

ప్రభాస్ కి నోటి నుంచి ఆయన పెళ్లి న్యూస్ వినాలని ఆహా వారు శతవిధాలుగా ప్రయత్నించారు. అయితే ఇది వర్కౌట్ అయ్యిందా లేదా అనేది మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తోంది. కాకపోతే ఈ ఎపిసోడ్లో ఫాన్స్ ను ఉర్రూతలూగించడానికి ప్రభాస్ రామ్ చరణ్ తో మాట్లాడిన డిస్కషన్.. అలాగే గోపీచంద్ తో ప్రభాస్ తను మనసులో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పమని చెప్పడం.. ఇక బాలకృష్ణ మీ అమ్మకు చెప్పినట్టు సమాధానాలు నాకు చెప్పకు.. ఇంతకీ నీ పెళ్లెప్పుడు.. నీ మనసులో ఉంది కృతి సనన్ ఆ లేదంటే అనుష్క శెట్టిన ఈరోజు నాకు తేల్చి చెప్పాల్సిందే అని ప్రభాస్ ని అడిగిన ప్రశ్నలు అన్నింటినీ కలిపి ఓ వీడియో చేసి ఆహా వారు విడుదల చేయగా.. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో సుమారు కొన్ని కోట్ల మిలియన్ వీడియోస్ ను సంపాదించుకుంది. ఈ ఒక్క వీడియో తో ప్రభాస్ పెళ్లి టాపిక్ పై ఎంతమంది ఆ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Advertisement