Samantha : సమంత మయూసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి నుండి కోలుకునేందుకు వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఎలాంటి కఠిన సమయాలను అయినా ఎదుర్కొనే ధీరత్వం సమంతకు ఉంది. మరికొన్ని గంటల్లో ఈ సంవత్సరం ముగిసి కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా సమంత ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
సమంత కొత్త సంవత్సరంలో కొత్తగా తనని తాను ముందుకు నడిపించేందుకు సమాయత్తమవుతున్నారు. సమంత ఇయర్ ఎండ్ నోట్ అభిమానుల్లో కొంత ఎమోషనల్ ని రగిలించింది. 2022 సంవత్సరాన్ని ముగిస్తున్నందున కొత్త సులభమైన తీర్మానాలు చేయడానికి ఇది సరైన సమయం అని సామ్ చెప్పింది. ఫంక్షన్ ఫార్వర్డ్… మన పరిధిలో వాటిని మనం నియంత్రిద్దాం.. కొత్త ఏడాదికి ముందే సులభమైన రిజల్యూషన్స్ కోసం ఇది సరైన సమయం అని ఊహించండి… మనపై దయ సున్నితత్వం ఉండాలి. గాడ్ బ్లెస్ హ్యాపీ 2023.. అంటూ తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత లో ఉన్న ఎమోషన్ మొత్తం ఈ పోస్టులో క్లియర్ కట్ గా అర్థమవుతుంది.. ఈ పోస్టుతో సమంత అందరి కంట కన్నీళ్లు తిరిగేలా చేసింది. సమంత ఆరోగ్య పరిస్థితి వచ్చే ఏడాది కోల్కొని తను మంచి సినిమాలలో నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.