Prabhas : ” ఆ అమ్మాయి పేరు ఏంటి .. కృతి సనన్ కదా .. పెళ్లి ఎప్పుడు ” అన్నాడు బాలయ్య .. ప్రభాస్ ఒకే ఒక్క సమాధానం తో అందరూ షాక్ !

Prabhas :

Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ విడుదలవగా.. అందులో ప్రభాస్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక బాలకృష్ణ ప్రభాస్ లవ్ మేటర్ రివిల్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేశాడు.. కానీ ప్రభాస్ చాలా తెలివిగా తప్పించుకున్నాడు..

Advertisement

రాముడు సీతతో రొమాన్స్ చేశారు అది నిజమేనా అని బాలయ్య అనగానే.. మేడం చెప్పేసారు కదా ఏం లేదు అని ప్రభాస్ అనగానే.. మేడం ఏంటి మేడం.. మేడం అనే పదంలోనే రొమాన్స్ ఉందని బాలయ్య పంచ్ వేశారు.. నువ్వు నో అంటున్నావ్.. ఆ అమ్మాయి నో అంటుంది.. కానీ బయట ఇంటర్నెట్లో మాత్రం బోలెడన్ని వస్తున్నాయి అని అనగానే.. మీకు రాలేదా సార్ అని ప్రభాస్ అంటాడు.. మేడం పేరేంటి అని బాలయ్య గట్టిగానే అడుగుతాడు.. మేడం పేరు చెప్పమని అనగానే.. కృతి సనన్ అని అంటాడు.. ప్రభాస్ శృతి కలిసున్న పిక్ ఒకటి వేస్తారు..

ప్రస్తుతం మేడం ఎవరు అని బాలయ్య రామ్ చరణ్ ను అడుగగా.. ప్రభాస్ కి మేడం ఎవరు లేరు అని రామ్ చరణ్ చెబుతాడు.. ఇక ప్రభాస్ కూడా లేదు అని చెబుతాడు.. మొత్తానికి ప్రభాస్ లవ్ లో ఉంది సనన్ తోనా శెట్టి తోనా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో రివిల్ చేస్తారేమో చూడాలి.

 

Advertisement