Suneetha: సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. సునీత స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించింది అనడంలో అతిశయోక్తి కాదు.. సునీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంది .. అయితే తాజాగా సింగర్ సునీత ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..
సునీత తన రెండవ పెళ్ళి చేసుకున్న సమయంలో విపరీతంగా ట్రోలింగ్ కు గురైంది. కానీ అదేమీ పట్టించుకోవడం కూడా ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా సునీత ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేసినట్టు.. ఆ పాటలు కుర్రకారుకి హిట్ ఎక్కించేలా ఉంటాయని.. డిఫరెంట్ టైప్స్ లో ఈ సాంగ్స్ ఉంటాయని.. ప్రతి ఒక్కరినీ ఈ పాటలు అలరిస్తాయని.. ఇవి మ్యాంగో మ్యూజిక్ సంస్థ నుంచి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అంతా రెడీ అయినట్టే రేపు లేదంటే సంక్రాంతికి ఈ సాంగ్స్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా సునీత అభిమానుల కోసం మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు దాంతో పునాకలు గ్యారెంటీ అట.. అందుకోసం మరికొన్ని గంటలు ఎదురు చూడక తప్పదు..