Ram charan Tej : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి అందరిని అలరించిన రామ్ చరణ్ పై పలు ఇండస్ట్రీ పెద్దల నుంచి ప్రశంసల వర్షం కూడా కురిసింది. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమాతో రామ్ చరణ్ పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని, అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ క్రేజీ కామెంట్లు చేయడం గమనార్హం.
ఇటీవల ఈయన పఠాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన షారుక్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అందులో భాగంగానే రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని రామ్ చరణ్ అభిమానులు కోరగా.. దానికి షారుక్ ఖాన్ స్పందిస్తూ..” చరణ్ నా ఓల్డ్ ఫ్రెండ్ ..మా పిల్లలకు తనంటే చాలా ఇష్టం” అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది.
He is an old friend and very loving to my kids https://t.co/LlLU9lHM0T
— Shah Rukh Khan (@iamsrk) December 17, 2022