Avatar 2 : ఊచ కోత కోస్తున్న అవతార్ 2 కలెక్షన్స్..!

Avatar 2  : దాదాపు రూ.2900 కోట్ల బడ్జెట్తో ప్రపంచవ్యాప్తంగా విజువల్ వండర్ మూవీగా తెరకెక్కించిన చిత్రం అవతార్ 2.. దాదాపు 2009లో వచ్చిన అవతార్ సినిమా కొనసాగింపుగా ఈ సినిమాను తాజాగా విడుదల చేశారు శుక్రవారం చాలా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్లు వసూలు చేస్తూ రికార్డు సృష్టిస్తోంది. మొదటిరోజు ఇండియాలో కేవలం రూ.38 కోట్లు సాధించిన ఈ సినిమా రెండవ రోజు రూ.45 కోట్ల కలెక్షన్ దాటేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ వీకెండ్స్ కావడంతో ఈ సినిమా చూసేవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది ఈ క్రమంలోనే కలెక్షన్స్ భారీగా వసూలు చేసినట్లు సమాచారం.

Avatar 2 collections are very highly collected..!
Avatar 2 collections are very highly collected..!

రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో వసూలు అయిన కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో రూ.13.05 కోట్లు.. సీడెడ్ లో రూ.3.20 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ ఏరియాలో కలిపి రూ. 8.25 కోట్లతో రూ.24.50 కోట్ల గ్రాస్.. రూ. 13 కోట్లకు పైగా షేర్ వసూలు అయినట్లు సమాచారం. ఇండియా మొత్తం మీద రెండవ రోజు రూ.45 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇలా మొదటి రెండు రోజుల్లో రూ.83 కోట్లకు పైగా వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.1704.31 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.